కృష్ణ

విద్యా వ్యవస్థలో పటిష్ఠమైన మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ: విద్య పేదలకు భారం కాకూడదనే లక్ష్యంతో విద్యా వ్యవస్థలో ప్రభుత్వం పటిష్ఠమైన మార్పులు తీసుకువస్తోందని ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి రాజన్న బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) చెప్పారు. శనివారం స్థానిక ఏజీకే మున్సిపల్ ఉన్నత పాఠశాలలో రాజన్న బడిబాట కార్యక్రమాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా 1వ తరగతిలో చేరిన 20మంది చిన్నారులచే సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ బడి ఈడు పిల్లలందరూ బడిలోనే ఉండి చదువుకోవాలనే లక్ష్యంతో రాజన్న బడి బాట కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. దివంగత రాజశేఖరరెడ్డి అమలు చేసిన రాజన్న బడి బాటను జగన్ తిరిగి అమలు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలను కల్పిస్తామన్నారు. పిల్లలను బడికి పంపించిన ప్రతి తల్లికీ జనవరి 26 నుండి అమ్మ ఒడి పథకం ద్వారా ఏటా రూ.15వేలు అందిస్తామన్నారు. ఉన్నత చదువులు అభ్యసించే అర్హులైన ప్రతి విద్యార్థికీ ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ను ప్రభుత్వమే చేస్తుందన్నారు. గ్రామాలు, పట్టణాల్లోని ప్రతి పాఠశాలలో రాజన్న బడి బాట కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించుకుంటున్నామన్నారు. విద్యలో మన రాష్ట్రం వెనుకబడి ఉందని, దీన్ని అధిగమించేందుకు జగన్మోహనరెడ్డి కృషి చేస్తున్నారన్నారు. చిన్నారుల విద్య పట్ల వారి తల్లిదండ్రులు పూర్తి అవగాహన కల్గివుండాలన్నారు. గుడివాడ ఆర్డీవో జీవీ సత్యవాణి మాట్లాడుతూ సమాజాభివృద్ధికి విద్య మూడో నేత్రమని, పిల్లలు చిన్నతనం నుండే విద్యనభ్యసించే విధంగా వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తామన్నారు. మున్సిపల్ వైస్‌చైర్మన్ అడపా బాబ్జి మాట్లాడుతూ విద్య ద్వారానే సమాజంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు. మున్సిపల్ కమిషనర్ డాక్టర్ ఏ శామ్యూల్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన వౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. అనంతరం చిన్నారులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలను మంత్రి కొడాలి నాని అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, కౌన్సిలర్లు కోట శ్రీరంజని, మాదాసు వెంకటలక్ష్మి, అల్లం సూర్యప్రభ, కిలిమి వెంకటరెడ్డి, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి ఎంవీ నారాయణరెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యుడు మండలి హనుమంతరావు, బీసీసెల్ రాష్ట్ర కార్యదర్శి రావులకొల్లు మల్లేశ్వరరావు, పాఠశాల హెచ్‌ఎం పీఎల్ నరసమ్మ, మున్సిపల్ పాఠశాలల కోఆర్డినేటర్ వీ రామప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.