కృష్ణ

‘మహా సంకల్పం’ నిర్వహణ తీరు ప్రజాస్వామ్యానికి విరుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, జూన్ 9: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మహా సంకల్ప దీక్షకు ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులను ఆహ్వానించకపోవడం ప్రజాస్వామ్య ప్రాదేశిక సూత్రాలకే విరుద్ధమని పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన విమర్శించారు. ప్రభుత్వ రెండేళ్ల పాలన సందర్భంగా నిర్వహించిన నవ నిర్మాణ దీక్ష, బుధవారం నిర్వహించిన మహా సంకల్ప దీక్షలు ప్రభుత్వ కార్యక్రమాలా? పార్టీ కార్యక్రమాలా? అని ప్రశ్నించారు. పెదపూడి గ్రామంలో కల్పన విలేఖర్లతో మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రతిపక్ష ప్రజాప్రతినిధులను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. గత ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలను ఏమాత్రం అమలు చేయలేదన్నారు. రెండు నెలల్లో కృష్ణా పుష్కరాలు వస్తున్నా పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండగా పుష్కర పనులు ఏవిధంగా జరుగుతాయని ప్రశ్నించారు. తెలుగు తమ్ముళ్ల జేబులు నింపుకునే విధంగా పుష్కర పనులు ఉన్నాయన్నారు. నీరు-చెట్టు, ఉచిత ఇసుక పథకం అవినీతికి పరాకాష్టగా మారాయన్నారు. రైతు, డ్వాక్రా రుణమాఫీ ఎన్నికల ప్రచారానికి పరిమితమయ్యాయన్నారు. చంద్రబాబు పాలన పట్ల విసిగివేసారిన ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సమయం కోసం ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యే కల్పన హెచ్చరించారు. సమావేశంలో పెదపూడి ఉప సర్పంచ్ సిహెచ్ కనకదుర్గ, వైసిపి నాయకుడు రాజులపాటి మురళి, కిరణ్ బాబు, తాతా శేషుబాబు పాల్గొన్నారు.