కృష్ణ

కాంగ్రెస్ పాలనలో స్కామ్‌లు.. బీజేపీ హయాంలో స్కీమ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామర్రు: కేంద్రంలో గత కాంగ్రెస్ పాలనలో స్క్యామ్‌లు.. స్కామ్‌లు అని వినిపిస్తే బీజేపీ కేంద్ర ప్రభుత్వ పాలనలో స్కీమ్‌లు, డ్యామ్‌లు అని వినిపిస్తూ పేదల సంక్షేమం, దేశ ప్రగతే ధ్యేయంగా ప్రధాని నరేంద్ర మోదీ పాలన సాగిస్తున్నారని భారతీయ జనతా పార్టీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుపాటి పురంధ్రీశ్వరి పేర్కొన్నారు. పామర్రులో మంగళవారం పామర్రు జెడ్పీటీసీ పొట్లూరి శశి, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు పొట్లూరి కృష్ణబాబు బీజెపీలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దృఢమైన నిర్ణయాలు బీజెపీ కేంద్ర ప్రభుత్వం తీసుకుని దేశంలో తిరుగులేని శక్తిగా ఎదిగిందన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు అందరినీ కలుపుకుపోయి ప్రగతిని సాధిస్తూ విశ్వాసాన్ని పొందుతున్నామన్నారు. దేశంలో 1700 రాజకీయ పార్టీలు ఉండగా బీజెపీ మాత్రమే వంశపారంపర్య రాజకీయాలు లేకుండా సేవ చేసే వారికే పదవిని కల్పిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించి బలహీనవర్గాల అభ్యున్నతికి కృషి చేస్తోందన్నారు. అలాగే త్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా బిల్లును ప్రవేశపెట్టి మైనార్టీ మహిళల సంక్షేమాన్ని చూస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల అభ్యున్నతి కోసం 125 సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని ఆమె వివరించారు. గత టీడీపీ పాలన అవినీతిమయంగా సాగటంతో ఆ ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపారన్నారు. ముఖ్యంగా నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని కోరుకునేదల్లా అధికారంలోకి రాగానే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని ప్రకటించాడని, ఆ మాటను నిలబెట్టుకుని, త్వరలో కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని పురంధ్రీశ్వరి కోరారు. సభలో పాల్గొన్న రాష్ట్ర బీజెపీ సహ ఇన్‌ఛార్జి సునీల్ దావేదర్ మాట్లాడుతూ అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వాలను అంతమొందించాలని గతంలో ఎన్టీ రామారావు తొలి అడుగు వేసి సాధించగా, అలాంటి బాహుబలి నేత ఎన్టీ రామారావును దత్తత రూపంలో చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్నారు. టీడీపీ పాలన యావత్తు అవినీతి మయంతో కూరుకుపోయిందని, చంద్రబాబు చందా బాబుగా ఆమె అభివర్ణించారు. కృష్ణా జిల్లా బీజెపీ అధ్యక్షుడు చిగురుపాటి కుమార స్వామి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామినేని వెంకటకృష్ణ, పంతం వెంకట గజేంద్ర, మైనార్టీ శాఖ రాష్ట్ర కార్యదర్శి షేక్ బాజీ, పామర్రు నియోజకవర్గ బీజెపీ కన్వీనర్ వలపర్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని మాట్లాడారు. పొట్లూరి కృష్ణబాబు, పొట్లూరి శశితో పాటు సుమారు వెయ్యి మంది బీజెపీ కండువాలు కప్పించుకుని ఆ పార్టీలో చేరారు. తొలుత బీజెపీ కార్యాలయాన్ని పురంధ్రీశ్వరి ప్రారంభించగా అనంతరం ర్యాలీ నిర్వహించి అంబేద్కర్, డా. ఎన్టీ రామారావు విగ్రహాలకు పూలమాలలు వేసి అతిథులు నివాళులర్పించారు.