కృష్ణ

ముసునూరులో భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముసునూరు: మండల కేంద్రమైన ముసునూరుతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం భారీ వర్షం కురిసింది. ఉదయం 8 గంటలకే ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. భారీ వర్షపాతం నమోదు కావడంతో డ్రైయిన్‌లు పొంగి పొర్లాయి. రోడ్లకు ఇరువైపుల ఉన్న భారీ వృక్షాలు సైతం గాలులు వీయడంతో నేలకు ఒరిగాయి. విరిగిన చెట్లను రెవిన్యూ, ఆర్‌అండ్‌బి అధికారులు సకాలంలో స్పందించి నరికించి పక్కకు వేయడంతో ప్రయాణికులకు మార్గం సుగమమైంది. డ్రైయిన్‌లు అన్ని చెత్తాచెదారం, మట్టితో పూడిపోవడంతో వర్షపు నీరు రోడ్లపై ప్రవహించింది. మురుగు, చెత్తాచెదారం వర్షపునీటితో రోడ్లపైకి చేరడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. వర్షపునీరు రోడ్లపైకి చేరడంతో రోడ్లు సరిగా కనబడక అది డ్రైయినో, రహదారో తెలియక వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అటు పంచాయతీ, ఇటు ఆర్‌అండ్‌బి అధికారులు రోడ్లకు ఇరువైపుల ఉన్న డ్రైయిన్‌లు పూడుకుమపోయిన చోద్యం చూస్తున్నారే తప్ప డ్రైయిన్‌లలో పూడిక తీసి వర్షపు నీరు పారేలా చర్యలు చేపట్టకుండా మిన్నకుండటంతో ప్రజలు అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో ముందస్తు ప్రణాళికలను సిద్దం చేసుకుని డ్రైయిన్‌లలో పూడికతీసి వర్షపు నీరు ప్రవహించేలా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరించడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వచ్చిన ప్రతి సారి ఇదే విధంగా జరుగుతున్నప్పటికి పాలకులు, అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో పూడుకుపోయిన డ్రైయిన్‌లలో పూడికతీత పనులు చేపట్టి వర్షపు నీరు ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రాంత ప్రజలు ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు.
పంటలకు మేలు చేసిన వర్షం
బుధవారం ఉదయం కురిసిన భారీ వర్షం మండలంలో సాగుచేస్తున్న వివిధ రకాల పంటలకు మేలు చేసింది. మండలంలో ప్రస్తుతం పత్తి విత్తనాలు నాటడంలో రైతులు బిజీబిజీగా ఉన్నారు. పత్తి విత్తనాలు మొలకకు ఈవర్షం ఎంతగానో ఉపయోగపడుతుందని పత్తి రైతులు చెబుతున్నారు. అలాగే ఉద్యానవన పంట అరటికి ఈవర్షం ఎంతగానో ఉపయోగపడిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.