కృష్ణ

విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట రూరల్: విద్య , వైద్యానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ఈ రెండు రంగాల్లో సంసర్కణలు అమలు చేస్తుందని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అన్నారు. బుధవారం చిల్లకల్లు బియిడి కళాశాలలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో సామినేని ఉదయభానుకు ఆత్మీయ సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఎంఇఓ రవీంద్రనాయక్ అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులను ఉద్దేశించి సామినేని ఉదయభాను ప్రసంగించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మొదటి సారిగా ప్రజల ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి పేద ప్రజలకు కార్పోరేట్ వైద్య సదుపాయం కల్పించారని, తండ్రి బాటలోనే నేటి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పయనిస్తున్నారని అన్నారు. ప్రజలు తమకు తిరుగులేని ఆధిక్యం ఇచ్చినా సీఎం జగన్ అధికారంగా భావించకుండా సేవా మార్గంలో పయనిస్తున్నారని కొనియాడారు. గత పాలకులు ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను విస్మరిస్తే నెలరోజుల వ్యవధిలోనే సీఎం జగన్ అన్ని హామీలను నేరవేర్చే క్రమంలో ఉన్నారని, దీనిలో భాగంగానే అందరు విద్యను అభ్యసించాలన్న ఉద్దేశ్యంతో అమ్మఒడి కార్యక్రమాన్ని రూపొందించి ప్రతి విద్యార్థికి 15వేల రూపాయలు చెల్లించే విధంగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈపథకం ప్రభుత్వ, ప్రవేట్ కానె్వంట్‌లకు సైతం వర్తిస్తుందని స్పష్టం చేశారు. ప్రతి స్కూల్ ద్వారా ఉచిత విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రభుత్వ పాఠశాలలను ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. నారాయణ, చైతన్య వంటి కార్పోరేట్ స్కూల్స్ విద్యను వ్యాపారంగా మార్చాయని విమర్శించారు. జిల్లాలోనే నియోజకవర్గంలోని అన్ని పాఠశాలలు అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉండేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని, వారికి అండదండలుగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈసందర్భంగా మండల విద్యాశాఖాధికారులు ఉదయభానును గజమాల, శాలువాతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. ఈకార్యక్రమంలో డివైఇఓ చంద్రకళ, మాజీ మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, మండల సూపరిటిండెంట్ రాజు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయ యూనియన్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.