కృష్ణ

32 మంది ఎంపీడీవోల బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : ఇటీవల నిర్వహించిన సాధారణ ఎన్నికల ముందు జిల్లా నుండి ఇతర జిల్లాలకు బదిలీ అయి రీబ్యాక్ ఉత్తర్వులతో మంగళవారం తిరిగి వారి వారి పాత స్థానాల్లో బాధ్యతలు స్వీకరించిన ఎంపీడీవోలను జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ బుధవారం బదిలీ చేశారు. జిల్లాలో మొత్తం 32 ఎంపీడీవోలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గుడివాడ ఎంపీడీవో కె జ్యోతి నందివాడకు, గుడ్లవల్లేరు ఎంపీడీవో ఎవి రమణ గుడివాడకు, విస్సన్నపేట ఎంపీడీవో జి రాణి నూజివీడుకు, కంకిపాడు ఎంపీడీవో ఎం కృష్ణమోహన్ కంచికచర్లకు, అవనిగడ్డ ఎంపీడీవో సునీతా శర్మ ఉయ్యూరుకు, ఘంటసాల ఎంపీడీవో కెవి సుబ్బారావు గన్నవరంకు, నూజివీడు ఎంపీడీవో పి అనురాధ జి.కొండూరుకు, ఎ.కొండూరు ఎంపీడీవో ఎఎన్‌వి నాంచారావు పమిడిముక్కలకు, ఆగిరిపల్లి ఎంపీడీవో గౌసియా బేగం ఎ.కొండూరుకు, వత్సవాయి ఎంపీడీవో టిఎస్ జయచంద్ర జగ్గయ్యపేటకు, పమిడిముక్కల ఎంపీడీవో పి స్వర్ణలత తోట్లవల్లూరుకు, కోడూరు ఎంపీడీవో బి వెంకటేశ్వరరెడ్డి చందర్లపాడుకు, చల్లపల్లి ఎంపీడీవో పి వెంకటేశ్వరరావు గూడూరుకు, జగ్గయ్యపేట ఎంపీడీవో ఎస్‌వి ప్రసాద్ వత్సవాయికి, కంచికచర్ల ఎంపీడీవో వై పిచ్చిరెడ్డి గంపలగూడెంకు, విజయవాడ రూరల్ ఎంపీడీవో కె అనురాధ కంకిపాడుకు, పెడన ఎంపీడీవో జె రాధమ్మ ఉంగుటూరుకు, జి.కొండూరు ఎంపీడీవో బిఎమ్ లక్ష్మికుమారి అవనిగడ్డకు, పామర్రు ఎంపీడీవో ఎన్ జానకిదేవి గుడ్లవల్లేరుకు, నాగాయలంక ఎంపీడీవో ఎఎల్‌ఆర్‌కె ప్రసాద్ చల్లపల్లికి, కైకలూరు ఎంపీడీవో ఆర్ దివాకర్ ఇబ్రహీంపట్నంకు, కలిదిండి ఎంపీడీవో జి ఆంజనేయులు రెడ్డిగూడెంకు, గన్నవరం ఎంపీడీవో పి భార్గవి ఆగిరిపల్లికి, మైలవరం ఎంపీడీవో శ్రీనాధ స్వామి కలిదిండికి, ఉయ్యూరు ఎంపీడీవో వైవివిఎం ప్రసాద్‌బాబు నాగాయలంకకు, తిరువూరు ఎంపీడీవో ఎస్ వెంకట రమణ విస్సన్నపేటకు బదిలీ అయ్యారు. జిల్లాకు కొత్తగా వచ్చిన పి మల్లేశ్వరిని పామర్రుకు, పి పద్మను ఘంటసాలకు, జి సుధా ప్రవీణ్‌ను కైకలూరుకు, డి సుబ్బారావును మైలవరంకు, జె సుజాతను విజయవాడ రూరల్‌కు బదిలీ చేస్తూ కలెక్టర్ ఇంతియాజ్ ఉత్తర్వులు జారీ చేశారు.