కృష్ణ

రొయ్యల రైతుల్ని కలవరపెడుతున్న వాతావరణంరొయ్యల రైతుల్ని కలవరపెడుతున్న వాతావరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందివాడ, జూన్ 10: వాతావరణంలో చోటు చేసుకున్న పెను మార్పుల వల్ల రొయ్యల రైతులకు కంటి మీద కునుకు ఉండట్లేదు. శుక్రవారం ఈ విషయమై రొయ్యల సాగుపై రైతులు మాట్లాడారు. రోజంతా చల్లగా మబ్బులు పట్టి ఉండటం, ఎడతెరిపి లేకుండా చినుకులు పడుతుండడంతో చెరువుల్లో రొయ్యలకు ప్రాణ వాయువు సమస్య ఏర్పడిందన్నారు. అక్కడక్కడా చెరువుల్లో రొయ్యలు చనిపోతున్నాయన్నారు. మండలంలో సుమారు ఆరు వేల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోందని, ప్రస్తుత వాతావరణం చూసి నష్టాల భయంతో రైతులు తల్లడిల్లుతున్నామన్నారు. ఈ సంవత్సరం పంట కాల్వలు ద్వారా మంచినీటి సదుపాయం లేకపోయినా బోర్లు ద్వారా (ఉప్పు నీటి) రొయ్యల సాగు చేపట్టినట్టు చెప్పారు. రొయ్యల సాగు ప్రస్తుతం బాగుండటం, ధరలు కూడా స్థిరంగా ఉండటంతో ఎక్కువ మంది రైతులు రొయ్యల సాగు చేపట్టారన్నారు. గత ఆరు నెలల్లో రొయ్యల సాగు లాభాలు తెచ్చిపెట్టిందన్నారు. ఇలా ఎన్నో ఆశలతో సాగు చేస్తున్న రైతులకు ప్రస్తుత వాతావరణం ప్రాణ సంకటంగా మారిందన్నారు. జూన్ మొదటి వారం అంతా చల్లగా ఉండటంతో రొయ్యల సాగుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందన్నారు. చెరువుల్లో రొయ్యలను కాపాడుకోడానికి రైతులు నిరంతరం శ్రమిస్తున్నట్టు చెప్పారు. వారం రోజులుగా మందులతోనే రొయ్యల ప్రాణాలను కాపాడుకుంటూ వస్తున్నట్టు తెలిపారు. నిరంతరం ఏరియేటర్లు తిప్పుతూ ప్రత్యేక ట్యూబులతో ఆక్సిజన్ వాయువు అందిస్తున్నామన్నారు. అయినా కొన్ని చెరువుల్లో రొయ్యలు మృత్యువాతపడుతున్నట్టు తెలిపారు.