కృష్ణ

నా నివాసం ముంచాలనుకొని పేదల ఇళ్లు ముంచేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : కుట్రలు, కుతంత్రాలతో ప్రభుత్వం కరకట్ట పక్కనున్న తన నివాసాన్ని ముంచేందుకు ఎంతగానో ప్రయత్నించిందని మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అయితే తన నివాసాన్ని ముంచలేకపోయినా పేదల ఇళ్లను మాత్రం ముంచేశారని ధ్వజమెత్తారు. నగరంలోని కృష్ణలంక, జిల్లాలో పెనమలూరు, కంకిపాడు, దివిసీమ ప్రాంతాల్లోని వరద ముంపు ప్రాంతాలను మంగళవారం ఆయన పరిశీలించి, బాధితులను పరామర్శించారు. ఈసందర్భంగా వైకాపా ప్రభుత్వ విధానాలపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ప్రాజెక్టుల్లో కొంత నీటిని ముందే విడుదల చేసి ఉంటే వరద వచ్చేదికాదని ఆయనన్నారు. కేవలం తన నివాసాన్ని ముంచాలనే పైన నీటిని ఆపి ఒక్కసారిగా కిందికి వదిలారన్నారు. పైగా తాను ఇంట్లో లేనప్పుడు ఖాళీ చేయమని నోటీసులు ఇవ్వడానికి వచ్చారంటూ విమర్శించారు. నా నివాసం మునిగిపోతే ఇంటి యజమానికి ఇబ్బంది కలుగుతుంది కానీ మంత్రులకు బాధెందుకని మండిపడ్డారు. ఓవైపు ముంపునకు గురై ప్రజలు పడుతున్న తీవ్ర ఇబ్బందులు పాలకులకు పట్టటం లేదని విమర్శించారు. అన్న క్యాంటీన్లను ఎత్తివేయడంపై కూడా ప్రభుత్వ తీరును చంద్రబాబు ఎండగట్టారు. అన్న క్యాంటీన్లు ఉండి ఉంటే వరద బాధితుల ఆకలి తీర్చేవన్నారు. అన్న క్యాంటీన్లను ఎందుకు తొలగించారో అర్థం కావడం లేదన్నారు. జగన్ ఎన్నో మాటలు చెప్పారుకాని చేతలు గడప దాటటం లేదంటూ ఎద్దేవా చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముంపు బాధితులకు ప్రభుత్వం ఎలాంటి సాయం చేయడం లేదని విమర్శించారు. కనీసం భోజన సదుపాయం కూడా కల్పించలేదన్నారు. విజయవాడ కృష్ణలంక ప్రాంతంలో రిటైరింగ్ వాల్ నిర్మించాలని బాబు డిమాండ్ చేశారు. స్థానికులందరికీ ఇళ్లపట్టాలు ఇవ్వాలన్నారు. పలు ప్రాంతాల్లో ముంపు బాధితుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. బాధితులు తమ సమస్యలు చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బాబు పర్యటనలో పెద్దసంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రభుత్వ తప్పిదంతోనే వరద కష్టాలు
* మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా
కంకిపాడు, ఆగస్టు 20: సర్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడ్డ వరద బాధితలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మండలంలోని ముంపు ప్రాంతాల్లో కాసరనేనివారిపాలెం, మద్దూరు గ్రామాల్లో చంద్రబాబు పర్యటించారు. దీనిలో భాగంగా వరద బాధితులు, మహిళలతో మాట్లాడారు. వారు చెప్పిన సమస్యలు అడిగి తెలుసుకున్నారు, రైతులు వరదలతో దెబ్బతిన్న పంటలను ముఖ్యమంత్రికి చూపించి గోడు వెళ్లబోసుకున్నారు. నష్టపోయిన పంటకు పరిహారం అందించాలని రైతులు వేడుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే జగన్‌మెహన్‌రెడ్డి విదేశీపర్యటనలు చేయటం సిగ్గు చేటన్నారు. ప్రభుత్వం స్వయంకృతాపరాధంతోనే రైతులు నదీ తీరగ్రామాల్లో పంటలు నష్టపోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. వదరదలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి అన్ని విధాల అదుకునేంతవరకు తెలుగుదేశం పార్టీ ఉండి పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జలవనరలశాఖ మంత్రి దేవినేని ఉమా, మాజీ పెనమలూరు శాసనసభ్యుడు బోడే ప్రసాద్, టీడీపీ గుడివాడ నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్, టీడీపీ నాయకులు దేవినేని రాజా, గొంది శివరామకృష్ణ, వెలగపూడి శివశంకర్, నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.