కృష్ణ

పౌరస్వేచ్ఛను హరించడం నిరంకుశత్వమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉయ్యూరు : ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, పౌరస్వేచ్ఛకు భంగం కలిగించడం నిరంకుశత్వమేనని శాసనమండలి సభ్యుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ అన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర శాఖ బుధవారం చేపట్టిన ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమాన్ని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. మంగళవారం సాయంత్రం నుంచే రాజేంద్రప్రసాద్ ఇంటి వద్ద పోలీసు పికెట్ ఏర్పాటు చేసి ఆయనను గృహ నిర్బంధంలో ఉంచారు. పార్టీ పిలుపు మేరకు ఆత్మకూరు వెళ్లేందుకు నాయకులు బుధవారం ఉదయం రాజేంద్ర ఇంటి వద్దకు చేరుకున్నారు. వారిని ఎమ్మెల్సీ ఇంటి వరకు వెళ్లనివ్వకుండా అన్ని రహదారులు మూసి ఉంచారు. ఉదయం 10గంటల సమయంలో పార్టీ నాయకులతో కలిసి రాజేంద్ర ఆత్మకూరు వెళ్లేందుకు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. ఒకానొక సమయంలో నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కొందరు నాయకులను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించిన పోలీసులు, రాజేంద్ర, మరికొందరిని ఇంట్లోకి పంపి గేటుకు తాళం వేశారు. చేసేదిలేక నాయకులు మూసి ఉంచిన గేటులోపలే నిరసన వ్యక్తం చేస్తూ బైఠాయించారు.
ఈసందర్భంగా రాజేంద్ర మాట్లాడుతూ వందరోజుల పాలనలో జగన్ సాధించిందేమీ లేదని, ప్రతిపక్ష పార్టీ వారిని సాధించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఆత్మకూరు గ్రామానికి చెందిన సుమారు 150మంది ఊరొదిలి భయంతో గుంటూరు వచ్చారంటే వైసీపీ రాక్షస పాలన ఏవిధంగా ఉందో అర్థవౌతుందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని, ఆత్మకూరు వెళ్లితీరతామని రాజేంద్ర హెచ్చరించారు. పార్టీ నాయకులు వీరంకి వెంకట గురుమూర్తి, జంపాన పూర్ణచంద్రరావు, అబ్దుల్ ఖుద్దూస్, సీహెచ్ ప్రవీణ్, కొండా ప్రవీణ్, కాగిత కొండ, రాజులపాటి ఫణి, తదితరులు పాల్గొన్నారు. ఉయ్యూరు సీఐ ప్రసాద్ నేతృత్వంలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు.