కృష్ణ

అడుగడుగునా అడ్డగింపులే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చిన ఛలో ఆత్మకూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ చంద్రబాబునాయుడు ఛలో ఆత్మకూరుకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. బుధవారం ఛలో ఆత్మకూరుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న టీడీపీ ముఖ్య నేతలందరినీ పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఇళ్ల నుండి బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. వివిధ వాహనాల్లో ఆత్మకూరుకు వెళుతున్న పార్టీ శ్రేణులను అడ్డగించి సమీపంలోని పోలీసు స్టేషన్లకు తరలించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జ్‌లు, పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న నేతలందరినీ హౌస్ అరెస్టు చేయడం గర్హనీయమని నాయకులు తీవ్రంగా ఖండించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సైతం ఉండవల్లిలోని తన నివాసంలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. దీంతో చంద్రబాబు నాయుడు 12గంటల నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. హౌస్ అరెస్టు అయిన నేతలంతా పోలీసుల తీరును నిరసిస్తూ వారి వారి నివాసాల వద్దనే 12గంటల నిరసన దీక్షకు దిగారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పరిధిలో మొత్తం 441 మందిని పార్టీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి 35 కేసులు నమోదు చేశారు. జిల్లా కేంద్రం మచిలీపట్నంలో శాసనమండలి సభ్యుడు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడును పోలీసులు అరెస్టు చేశారు. ఛలో ఆత్మకూరుకు వెళుతున్న ఆయన్ని గూడూరు వద్ద పోలీసులు అడ్డగించి తిరిగి ఆయన నివాసానికి తీసుకు వచ్చారు. ఇంటి వద్దనే ఉండాలని, బయటకు వెళ్లేందుకు వీలు లేదని పోలీసులు అర్జునుడుకు స్పష్టం చేశారు. దీంతో ఆగ్రహించిన ఆయన తన నివాసం ఎదుట నిరసన దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసిన కార్యకర్తలతో కలిసి 12గంటల దీక్షకు దిగారు. గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, విజయవాడలో మాజీ మంత్రి కొల్లు రవీంద్రలను పోలీసులు గృహ నిర్బంధించారు. ఉయ్యూరులో ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్, నందిగామలో తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేటలో మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, తిరువూరులో మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు, కైకలూరులో జయమంగళ వెంకట రమణలతో పాటు బాపులపాడు మండలం రంగన్నగూడెం గ్రామంలో రాష్ట్ర ఎఫెక్స్ కమిటీ మాజీ సభ్యుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.

పోలీసు నిర్బంధంలో తెలుగు తమ్ముళ్లు
మైలవరం, సెప్టెంబర్ 11: చలో ఆత్మకూరు పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రులను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేయటాన్ని నిరసిస్తూ మైలవరం తెలుగు తమ్ముళ్ళు బుధవారం ఆందోళనకు దిగారు. దీంతో శాంతి భద్రతల దృష్ట్యా మైలవరం పోలీసులు వీరిని స్థానిక పోలీస్ స్టేషన్‌లోనే నిర్బంధించారు. అంతకుముందు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును గొల్లపూడి లోని తన నివాసంలో హౌస్ అరెస్ట్‌కు నిరసనగా స్థానిక ఎన్టీఆర్ సర్కిల్‌లో వీరు ఆందోళనకు దిగారు. ఈసందర్భంగా నేతలు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థకే ఇది మాయని మచ్చ అన్నారు. వైసీపీ నాయకుల దాడులకు ఖండిస్తూ తెలుగుదేశం ఆధ్వర్యంలో చలో ఆత్మకూరు పిలుపునిస్తే ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన వ్యక్తం చేయటానికి వెళ్తున్న మాజీ మంత్రిని అక్రమంగా అరెస్ట్ చేయటం శోచనీయమన్నారు. వైసీపీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని త్వరలోనే వారికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో పార్టీ నేతలు రాము, గొల్లపూడి వెంకటేశ్వరరావు, ఆంజనేయులు, సాంబయ్య, దుర్గారావు తదితరులున్నారు. అనంతరం వీరిని మైలవరం ఎస్‌ఐ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించి సాయంత్రం సమయంలో వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.