కృష్ణ

దేశాన్ని సంక్షేమం దిశగా నడిపిస్తున్న మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామర్రు : ప్రధాన మోదీ సుపరిపాలన వల్ల ప్రజలు సంక్షేమ దిశగా పయనిస్తూ అభ్యున్నతి చెందుతున్నారని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి కుమార స్వామి పేర్కొన్నారు. ప్రదాని మోదీ జన్మదినోత్సవం, పామర్రు నియోజకవర్గ బీజెపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పొట్లూరి కృష్ణబాబు జన్మదినోత్సవం సంయుక్తంగా స్థానిక వాసవీ వృద్దాశ్రమంలో మంగళవారం బీజెపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో చిగురుపాటి మాట్లాడుతూ ప్రపంచ దేశాలలోనే భారత దేశాన్ని అగ్ర రాజ్యంగా నిలిపేదిశగా ప్రధాని మోదీ పరిపాలన సాగిస్తున్నారన్నారు. ఆంధ్రాలో బీజెపీ అధికారంలోకి వచ్చే దిశగా చర్యలు చేపట్టామని, ఇప్పటికే ఆంధ్రా ప్రజలు బీజెపీ పాలన రాష్ట్రంలో రావాలని స్వాగతిస్తున్నారని వెల్లడించారు. అనంతరం ఘనంగా అన్నసమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీజెపీ ఇన్‌చార్జి పొట్లూరి కృష్ణబాబు, బీజెపీ నేతలు వలపర్ల వెంకటేశ్వరరావు, పువ్వాడ శ్రీనివాసరావు, కాకర్ల సత్యనారాయణ, ఆళ్ల రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వృద్దాశ్రమంలో కేక్ కట్ చేసి వృద్ధులకు పండ్లు, మిఠాయిలు, నూతన వస్త్రాలను కృష్ణబాబు అందజేశారు. అలాగే పలువురు ఆటో డ్రైవర్లకు యూనీఫామ్‌లను కూడా పొట్లూరి బహూకరించారు.
పాల ఉత్పత్తిదారుల సంక్షేమమే
మిల్క్ యూనియన్ లక్ష్యం
బంటుమిల్లి, సెప్టెంబర్ 17: పాల ఉత్పత్తిదారుల సంక్షేమమే ధ్యేయంగా జిల్లా మిల్క్ యూనియన్ పని చేస్తోందని జిల్లా విజయ డైరీ యూనియన్ అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని మల్లేశ్వరం, కృత్తివెన్ను మండలం చెరుకుమిల్లి గ్రామాలలోని పాల ఉత్పత్తిదారులను ఆయన కలిసి వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. మల్లేశ్వరం పాల ఉత్పత్తిదారుల సహాయ సంఘ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. అత్యధికంగా పాలు పోసిన కందుల పోతురాజు, రాజులపాటి శ్రీనివాసరావులను దుశ్శాలువాలతో చలసాని ఆంజనేయులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డైరెక్టర్ అర్జా వెంకట నగేష్, సంఘం అధ్యక్షురాలు పేకేటి వీరమ్మ, మాజీ గ్రామ సర్పంచ్ కె నాగేశ్వరరావు, పి వీరసాయి, పాలశీతలీకరణ మేనేజర్ ఆర్ రూపేష్, సూపర్‌వైజర్ తోట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
పథకాలపై వలంటీర్లకు శిక్షణ
మోపిదేవి, సెప్టెంబర్ 17: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఎంపీడీఓ జె స్వర్ణ భారతి అధ్యక్షతన గ్రామ వలంటీర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మచిలీపట్నం మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ వైఎస్‌ఆర్ చేయూత పథకం కింద ఆటో డ్రైవర్లకు రూ.10వేలు సహాయాన్ని పొందేందుకు వలంటీర్లు ఇంటింట సర్వే నిర్వహించాలన్నారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
వైఎస్‌ఆర్ రైతు బరోసా, ప్రభుత్వ పథకాలపై ఎంపీడీఓ జె స్వర్ణ్భారతి మాట్లాడారు. వైఎస్‌ఆర్ రైతు భరోసా గ్రామ సదస్సుల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఇఓపీఆర్‌డీ అరుణ కుమారి, గ్రామ కార్యదర్శులు పి మాదవేంద్రరావు, ఎంఇఓ రాజ్ కుమార్, గ్రామ కార్యదర్శి మాదవేంద్రరావు, కె రామకోటేశ్వరరావు, కెపిటి సుందరి, వలంటీర్లు పాల్గొన్నారు.