కృష్ణ

హంసలదీవి బీచ్‌లో నాటు పడవ మునక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోడూరు : కోడూరు మండలం హంసలదీవి బీచ్‌లో ఘోర ప్రమాదం తప్పింది. చేపల వేటకు మచిలీపట్నం మంగినపూడి మత్స్యకారులకు చెందిన నాటు పడవ సముద్ర అలల ఉధృతికి ఒక్కసారిగా తిరగబడింది. పడవలో ఉన్న ఐదుగురు మత్స్యకారులు స్వతహాగా గజ ఈతగాళ్లు కావటంతో నీట మునిగిన పడవ మీదకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. అదే సమయంలో పాలకాయతిప్ప మత్స్యకారులు మరో పడవ అటుగా వచ్చింది. రెండు పడవల్లోని మత్స్యకారులు నీట మునిగిన పడవను యథా స్థితిలో పెట్టి పడవలో ఉన్న సముద్రపు నీటిని బయటకు తోడి సమీపంలోని హంసలదీవి బీచ్ ఒడ్డుకు వచ్చారు. నీట మునిగిన పడవలో ఉన్న మత్స్యకారులను మంగినపూడికి చెందిన బంగ్రాజు, సోమరాజు, తిమోతి, పాపారావు, గురవయ్యలుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పాలకాయతిప్ప మెరైన్ పోలీసులు హుటాహుటిన హంసలదీవి బీచ్ ఒడ్డుకు వచ్చి సురక్షితంగా బయట పడ్డ మత్స్యకారుల గురించి అరా తీసి వారి ప్రాంతాలకు పంపించారు.

జిల్లాలో 99 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
మచిలీపట్నం (కల్చరల్), సెప్టెంబర్ 17: జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఈ నెల 19వతేదీన జిల్లా స్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు జిల్లా విద్యా శాఖాధికారిణి ఎంవి రాజ్యలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కోర్టు సెంటరులోని రెవెన్యూ కల్యాణ మండపంలో వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా జిల్లాలో 99 మంది ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు.

కేసీపీ లక్ష్మీపురం కార్మికుల వినూత్న నిరసన
చల్లపల్లి, సెప్టెంబర్ 17: కార్మికుల ఆకలి కేకలు యాజమాన్యానికి వినిపించకపోవటం దురదృష్టికరమని జనసేన పార్టీ మాస్టర్ ట్రైనర్, అవనిగడ్డ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రాయపూడి వేణుగోపాలరావు ధ్వజమెత్తారు. లక్ష్మీపురం కెసీపీలోనే క్రషింగ్ కొనసాగించాలని, తొలగించిన కార్మికులను భేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికులు చేస్తున్న ఆందోళన, నిరసన మంగళవారం కూడా కొనసాగాయి. జనసేన పార్టీ మాస్టర్ ట్రైనర్ రాయపూడి వేణుగోపాలరావు నేతృత్వంలో చల్లపల్లి బస్టాండ్, ఆటో స్టాండులలో బస్సులు, ఆటోలు శుభ్రం చేసి వినూత్న నిరసన తెలిపారు. తమ నిరసనకు సంఘీభావం తెలపాలని వాహన దారులను కోరారు.