కృష్ణ

విద్యార్థినుల సమస్యల పరిష్కారానికి త్వరలో ఆన్‌లైన్ సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: విద్యా సంస్థల్లో విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలను ధైర్యంగా చెప్పేందుకు త్వరలో ఆన్‌లైన్ సేవలు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)తో కలిసి శనివారం ఆమె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని నర్సింగ్ కళాశాలను సందర్శించారు. కళాశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మహిళా సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. మహిళా సమస్యలపై మహిళా కమిషన్ ఎప్పుడూ పని చేస్తూనే ఉంటుందన్నారు. ఇకపై విద్యార్థినులు తమ సమస్యలను ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకు రావచ్చన్నారు. అందుకు సంబంధించిన వెబ్‌సైట్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఆన్‌లైన్‌లో వచ్చే ఫిర్యాదుల విచారణకై ఇంటర్నల్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలకు త్వరలోనే సొంత భవనం సమకూర్చటంతో పాటు వౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. ల్యాబ్, లైబ్రరి ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉండగా కళాశాల సొంత భవన నిర్మాణానికి గాను స్థలం మంజూరు చేసినట్లు తెలిపారు. భవన నిర్మాణానికి అవసరమైన నిధులను కూడా త్వరలో సమకూరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. ఎం జయకుమార్, ఆర్‌ఎంఓ డా. విజయ నిర్మల, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ. సిహెచ్ మరియ రోజమ్మ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన సేవలు
* మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం (కోనేరుసెంటర్), సెప్టెంబర్ 21: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. అర్థో విభాగంలో రోగులకు ఆధునాతమైన వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన సి-ఆర్మ్ ఇమేజ్ మిషన్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. ఎం జయకుమార్, ఆర్‌ఎంఓ డా. విజయ నిర్మల, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్ దాదా, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ బొర్రా విఠల్, ఏపీ ఎన్‌జీఓస్ తూర్పు కృష్ణా అధ్యక్షుడు వుల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.