కృష్ణ

అక్టోబర్, నవంబర్ మాసాల్లో ‘క్షిపణి’ కేంద్రానికి శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ: నాగాయలంక మండలం గుల్లలమోద వద్ద కేంద్ర రక్షణ శాఖ తలపెట్టిన క్షిపణి ప్రయోగ పరిశీలనా కేంద్రానికి అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో శంకుస్థాపన చేసే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ తెలిపారు. త్వరలోనే అధికారికంగా తేదీని ఖరారు చేస్తామన్నారు. క్షిపణి ప్రయోగ పరిశీలన సంస్థలో పని చేసే అధికారులు, సిబ్బందికి నివాస వసతి ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించి అనువైన స్థలాన్ని పరిశీలించేందుకు గాను ఆదివారం కలెక్టర్ అవనిగడ్డ వచ్చారు. తహశీల్దార్ కార్యాలయంలో గుల్లలమోద పరిసర ప్రాంతాల్లో అనువైన భూములకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. రక్షణ పరిశోధనా సంస్థలో పని చేసే శాస్తవ్రేత్తలు, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది నివాసం ఉండేందుకు గాను అవనిగడ్డ పరిసర ప్రాంతాల్లో అనువైన స్థలాలను గుర్తిస్తున్నట్లు కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో జె ఉదయభాస్కర్, తహశీల్దార్, జి విక్టర్‌బాబు, రక్షణ శాఖ అధికారులు కల్నల్, జగమత్, నిసాంక్స్, ఇఇ ఎం వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

డీఆర్‌డీఎ నివాసాల కోసం మా భూములు తీసుకోవద్దు
* భూముల పరిశీలనకు వచ్చిన ఆర్డీవోను అడ్డుకున్న సొసైటీ భూముల రైతులు
అవనిగడ్డ, సెప్టెంబర్ 22: నాగాయలంక మండలం గుల్లలమోద రక్షణ కేంద్రం శాస్తవ్రేత్తలు, అధికారులు నివాస గృహాలు, క్వార్టర్స్ నిర్మాణం కోసం తాము సాగు చేసుకుంటున్న సొసైటీ భూములను తీసుకోవద్దని పలువురు సొసైటీ సభ్యులు ఆర్డీవో జె ఉదయభాస్కర్, డీఆర్‌డీఎ అధికారులకు విన్నవించారు. మండల పరిధిలోని పులిగడ్డ గ్రామ పంచాయతీలోని సర్వే నెంబర్ 54, 55, 56లో ఉన్న 46.66 ఎకరాల సొసైటీ భూములను ఆర్డీవో, డీఆర్‌డీఎ అధికారులు ఆదివారం పరిశీలించారు. ఈ విషయం తెలుసుకున్న రేగుల్లంక, పాతకోట, వసుమట్ల గ్రామానికి చెందిన సొసైటీ సభ్యులు స్థానిక ఇరిగేషన్ కార్యాలయం వద్ద అధికారులను అడ్డుకుని తమ గోడును చెప్పుకున్నారు. ఈ భూముల మీదే ఆధారపడి జీవిస్తున్నామని వీటిని తీసుకుని మా పొట్ట కొట్టవద్దని వేడుకున్నారు. భూముల పరిశీలనకు మాత్రమే తాము వచ్చామని, రైతులు ఎటువంటి భయాలు పెట్టుకోవద్దని ఆర్డీవో రైతులకు తెలియజేశారు. ఆర్డీవో వెంట తహశీల్దార్ విక్టర్ బాబు, వీఆర్‌ఓ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.