కృష్ణ

‘బడి పిలుస్తోంది’లో విద్యార్థులతో చాకిరీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, జూన్ 16: స్థానిక జెడ్పీ హైస్కూల్‌లో గురువారం బడి పిలుస్తోంది కార్యక్రమం అపహాస్యానికి గురైంది. అధికారులెవ్వరూ లేక కేవలం ప్రస్తుతం విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకే ఈ కార్యక్రమాన్ని అప్పగించినట్టు కనిపించింది. బ్యానర్లను విద్యార్థులే పాఠశాల ముందు ఏర్పాటు చేయడం గమనార్హం. ఈవిషయంలో అధికారులు, ఉపాధ్యాయులు భాగస్వాములు కాకుండా ఉన్న విద్యార్థులతోనే బ్యానర్లు ఏర్పాటు చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
‘ప్రైవేట్’కు దీటుగా విద్యాబోధన జరగాలి
బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక కొత్త ఎడ్లలంక ప్రాథమికోన్నత పాఠశాలలో బడి ఉత్సవాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ డిఎస్సీ ద్వారా మండలానికి కొత్త ఉపాధ్యాయులు రానున్నట్లు తెలిపారు. ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన జరగాలన్నారు. ఈసందర్భంగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్, పెన్నులు, పలకలను అతిథులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో సునీతా శర్మ, ఎంపిపి కనకదుర్గ, తదితరులు పాల్గొన్నారు.