కృష్ణ

ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే సౌమ్య నిరాహార దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిగామ : ఇసుక అక్రమ రవాణా, ఇసుక కొరత, టీడీపీ నాయకులపై అక్రమ కేసులను నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య బుధవారం స్థానిక గాంధీ సెంటర్ వద్ద ఒక్క రోజు నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వ చర్యలను తీవ్రంగా విమర్శించారు. మధ్యాహ్నం జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ దీక్షా శిబిరాన్ని సంఘీభావం తెలియజేశారు. పెద్ద సంఖ్యలో నాయకులు, మహిళలు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలియజేశారు. సాయంత్రం మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు తదితరులు పాల్గొని దీక్ష విరమింపజేసారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుందని అన్నారు. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నేతలు విమర్శించారు. జగన్ ఫ్రభుత్వ పాలన అంతా రివర్స్‌లో సాగుతోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

హుండీ కానుకల ద్వారా తిరుపతమ్మ అమ్మవారికి 39లక్షల ఆదాయం

పెనుగంచిప్రోలు, అక్టోబర్ 16: స్థానిక శ్రీగోపయ్య సమేత శ్రీతిరుపతమ్మ అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా 39,49,900ల ఆదాయం వచ్చినట్లు కార్యనిర్వహణ అధికారిణి కె శోభారాణి తెలిపారు. మొత్తం ఆలయంలోని 13 హుండీలను నందిగామ గ్రూపు టెంపుల్ ఇన్స్‌పెక్టర్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో కానుకల లెక్కింపు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. హుండీల ద్వారా భక్తులు సమర్పించిన కానుకలు 35,98,625లు, అన్నదానం హుండీ ద్వారా 3,51,275లు, 26 గ్రాముల బంగారం, 360 గ్రాముల వెండి సమకూరినట్లు ఆమె తెలిపారు. ఈ ఆదాయం మొత్తం గడచిన 60 రోజుల్లో వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకమండలి చైర్మన్ అత్తులూరి అచ్యుతరావు, ధర్మకర్తలు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.