కృష్ణ

గ్రామ సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వానికి మంచిపేరు తేవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట రూరల్: రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామ సచివాలయ ఉద్యోగులు మంచిపేరు తేవాలని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను కోరారు. బుధవారం చిల్లకల్లు మండల పరిషత్ కార్యాలయంలో జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాలకు చెందిన గ్రామ సచివాలయ ఉద్యోగుల శిక్షణ తరగతులకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు నిజాయతీగా, పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించాలని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి, జిల్లా, నియోజకవర్గానికి మంచిపేరు తేవాలని కోరారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లోనే 4లక్షల ఉద్యోగాలు ఇచ్చిందని, అందులో 1.40 లక్షల శాశ్వత ఉద్యోగాలు కల్పించిందని చెప్పారు. మధ్యతరగతి కుటుంబాల్లోని వారికి సచివాలయ ఉద్యోగాలు రావడం శుభసూచకమన్నారు. అవినీతి రహిత పాలనే లక్ష్యంగా చేసిన గొప్ప ప్రయత్నమే సచివాలయమని, గ్రామ సచివాలయాల ద్వారా ప్రతి గ్రామంలో 10 శాశ్వత ఉద్యోగాలు కల్పించామన్నారు. ప్రజల ఇంటి వద్దకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం ఈ వ్యవస్థ ఉద్దేశ్యమని తెలిపారు. అనంతరం సచివాలయ ఉద్యోగులు ఉదయభానును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జయచంద్ర గాంధీ, సూపరింటెండెంట్ బి రాజు, పార్టీ నాయకులు తన్నీరు నాగేశ్వరరావు, ముత్యాల వెంకటచలం, చిలుకూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

పేట అభివృద్ధికి నిధులపై సీఎం సానుకూల స్పందన
* ప్రభుత్వ విప్ సామినేని వెల్లడి
జగ్గయ్యపేట, అక్టోబర్ 16: జగ్గయ్యపేట నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిని కలిసి సమస్యలు వివరించానని, ఆయన సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను తెలిపారు. బుధవారం ముఖ్యమంత్రిని కలిసి నియోజకవర్గంలోని పోలంపల్లి రాజీవ్ మునే్నరు డ్యామ్‌కు 400 ఎకరాల స్థల సేకరణకు గాను 145 కోట్ల నిధులు విడుదల చేయాలని కోరామన్నారు. దీనివల్ల ఒక టీఎంసీ నీటి నిల్వతో సహా 34వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, గత పదేళ్లుగా ఈ డ్యామ్ అభివృద్ధి పనులు ఆగిపోయాయని వివరించారు. గరికపాడు కృషి విజ్ఞాన కేంద్రంలో అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సు ఏర్పాటు చేయాలని, చిల్లకల్లు హైవే వద్ద ట్రామాకేర్ సెంటరు ఏర్పాటు చేయాలని, నియోజవర్గంలో బీసీ గురుకులం, గౌరవరం, నందిగామ మండలం రామిరెడ్డిపల్లిలో పీహెచ్‌సీలు ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. అరులనంద ట్రస్టుకు 2.50 ఎకరాల స్థలం కేటాయిస్తే ఉచిత వైద్యశాల ఏర్పాటు చేస్తామని ముందుకొచ్చినట్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. కృష్ణానదిపై వైకుంఠపురం వద్ద బ్యారేజీ నిర్మిస్తే 12 టీఎంసీల నీరు నిల్వతో పాటు అమరావతి - హైదరాబాద్ మధ్య 45కిలోమీటర్ల దూరం తగ్గుతుందని ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చినట్లు చెప్పారు. ఈ అంశాలపై నివేదికను అందజేయాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారని సామినేని వివరించారు.