కృష్ణ

కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి ‘రాయబారం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : కౌలు రైతుల సమస్యల పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా వ్యాప్తంగా అన్ని తహశీల్దార్ కార్యాలయాల వద్ద రాయబారాలు నిర్వహించనున్నట్లు ఏపీ కౌలు రైతు సంఘం తూర్పు కృష్ణా కార్యదర్శి ఎం హరిబాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కౌలు రైతులందరికీ పంట సాగు హక్కుల కార్డులు ఇచ్చి రైతు భరోసా అందించాలని డిమాండ్ చేశారు. వైఎస్‌ఆర్ సీపీ ప్రభుత్వం 2014 కౌలు రైతుల చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో నూతన చట్టాన్ని తెచ్చిందన్నారు. ఈ చట్టం ప్రకారం భూ యజమాని కౌలు పత్రంపై సంతకం పెడితేనే కౌలు గుర్తింపు కార్డు ఇస్తామనే నిబంధనలు పెట్టడం వల్ల కౌలు రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. భూ యజమానులు ఎవ్వరూ కౌలు ఒప్పంద పత్రంపై సంతకాలు పెట్టడానికి ముందుకు రావడం లేదన్నారు. దీంతో కౌలు రైతులకు గుర్తింపు కార్డులు రాని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఫలితంగా రైతు భరోసా కింద కౌలు రైతులు అర్హత కోల్పోతున్నారన్నారు. జిల్లాలో ఏ ఒక్క రైతుకు కూడా రైతు భరోసా అందజేయలేదని, 80 శాతం మంది కౌలు రైతులే సాగు చేస్తున్నారని తెలిపారు. కార్డు ఉంటేనే ఆర్థిక సాయం చేస్తామనే ఆంక్షలు పెట్టి వడపోత కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఖరీఫ్ సీజన్ చివరి దశకు వచ్చినా ఇంత వరకు కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వలేదన్నారు. పాత చట్టం ప్రకారమైతే కొంత మంది కౌలు రైతులకు కౌలు కార్డులు, పంట రుణాలు వచ్చాయన్నారు. నూతన చట్టం వల్ల కౌలు రైతులకు ఏ సంక్షేమ పథకం అందకపోవటంతో వారు ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి భూ యజమానికి కౌలు పత్రంపై సంతకం చేసినా, చేయకపోయినా కౌలుదారులందరికీ కౌలు గుర్తింపు కార్డులు, రైతు భరోసా అందించాలని డిమాండ్ చేశారు. ఇందు కోసం సోమవారం జిల్లా వ్యాప్తంగా అన్ని తహశీల్దార్ కార్యాలయాల వద్ద జరిగే రాయభారాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హరిబాబు విజ్ఞప్తి చేశారు.

విద్య, వైజ్ఞానిక సభల్లో బంటుమిల్లి, కృత్తివెన్ను ఉపాధ్యాయులు
బంటుమిల్లి, అక్టోబర్ 20: గుంటూరులో ఆదివారం ప్రారంభమైన ఏపీటీఎఫ్ 19వ రాష్ట్ర విద్య, వైజ్ఞానిక మహాసభలకు బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గుంటూరులో ప్రారంభమైన ఈ మహాసభలను పురస్కరించుకుని ఈ ప్రాంత నుండి ఉపాధ్యాయులు ఆదివారం ఉదయం తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు స్వామి, సిహెచ్ సాంబశివరావు, తాతా రేణుకారావు, కె శేషగిరి, పి శ్రీనివాసరావు, నాగ సంతోష్ కుమార్, శ్రీనివాసరావు, మోహనరావు, ముత్యాలరావు, వి శివరామకృష్ణ, యు శ్రీనివాసరావు, వేముల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.