కృష్ణ

అవనిగడ్డలో కదలని వర్షం నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ: అవనిగడ్డలో శనివారం అర్ధరాత్రి నుండి ఆదివారం సాయంత్రం వరకు భారీ వర్షం కురుస్తుండటంతో కాలనీలు, పంట పొలాల్లో నీరు చేరి కదలని పరిస్థితి ఏర్పడింది. స్థానికంగా ఉన్న సింహాద్రి కాలనీ, మండలినగర్, లంకమ్మ మాన్యం, రాజశేఖరపురం కాలనీల్లో రహదారులపై వర్షం నీరు కదలకుండా ఇప్పటికీ తిష్టవేశాయి. ఈ కారణంగా ఆయా కాలనీ వాసులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా వరి పొలాలు నీట మునుగుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రత్నకోడు డ్రెయిన్‌కు అడ్డుకట్టలు వేయటం వల్ల ఈ భారీ వర్షానికి వరి పొలాలు నీట మునిగాయి. గతంలో నాట్లు సమయంలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అధికారులు స్పందించి అడ్డుకట్టలు తొలగించటం వల్ల రైతులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం మరలా అడ్డుకట్టలు వేయటం వల్ల నీరు పారుదల కావటం లేదు. దీంతో అవనిగడ్డలోని డ్రెయిన్‌లు కూడా కదలని పరిస్థితి ఏర్పడింది. అధికారులు స్పందించి రత్నకోడుకు అడ్డుకట్టలు తొలగించాలని, లేని పక్షంలో రైతాంగం అప్పులుపాలవుతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని వేకనూరు మండలి వెంకట కృష్ణారావు కాలనీకి పొంచి ఉన్న ముప్పు భారీ వర్షానికి వేకనూరు ప్రధాన డ్రెయిన్ రెండు రోజులైనా నీరు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. సీసీ రోడ్లు సైతం మునిగిపోయే ప్రమాదం ఉండటంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ భారీ వర్షానికి పల్లపు ప్రాంతాలు, ప్రధాన రహదారి, ప్రభుత్వ కార్యాలయాలు జలమయమవటంతో శాసనసభ్యుడు సింహాద్రి రమేష్‌బాబు పరిశీలించి అధికారులను పిలిపించి తక్షణమే పూడిక తీయించాలని ఆదేశించటంతో పాటు ప్రధాన డ్రెయిన్‌లను ఎంపికచేసి మొదట ఆ డ్రెయిన్‌లను పూడికతీయించే పనులు చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు అధికారులు ప్రొక్లెయిన్‌తో డ్రెయిన్ తవ్వకం పనులు ప్రారంభించారు. అలాగే పలు ప్రాంతాలలోని డ్రెయిన్‌లను టీడీపీ నాయకులు బుద్ధప్రసాద్ తనయుడు మండలి రాజా, కె వెంకటేశ్వరరావు, గాజుల మురళీకృష్ణ, రాంప్రసాద్ పరిశీలించారు. పూడిక తీయించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.
నాగాయలంకలో భారీ వర్షం
నాగాయలంక, అక్టోబర్ 20: మండలంలోని వివిధ ప్రాంతాలలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాకాలంలో కురవాల్సిన వర్షాలు చలి కాలం ప్రవేశిస్తున్న సమయంలో కురవటం గమనార్హం. ఆకాశం ఒక్క సారిగా మేఘావృతమై వర్షం కురిసిన తదుపరి వాతావరణం ఒక్క సారిగా చల్లబడడానికి బదులు ఉమ్మదం ఏర్పడటం కొసమెరుపు. తరచు వర్షాలు కురవటం వల్ల రహదారులు చిత్తడిగా మారాయి. డ్రైన్‌లు సక్రమంగా పని చేయకపోవటంతో వర్షం నీరు బయటకుపోక వాహనచోదకులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతోంది. దీనికి తోడు పగటి వేళల్లో అప్రకటిత విద్యుత్ కోత విధించటం వల్ల వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో కూడా పలు గ్రామాలలో విద్యుత్ సరఫరా లేకపోవటంతో ప్రజలు దోమలతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భారీ వర్షంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.