కృష్ణ

ఉత్తమ వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్): ఉత్తమ వ్యక్తిత్వం అలవర్చుకుంటూ మనం చరిత్రలో ఒక పేజీని సృష్టించుకోవాలని కృష్ణా విశ్వవిద్యాలయం రిజిష్ట్రార్ డాక్టర్ కె కృష్ణారెడ్డి అన్నారు. గ్రామీణాభివృద్ధిపై బోధనాంశాల అభివృద్ధి అనే అంశంపై మహాత్మ గాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్యా శాఖ, కేంద్ర ప్రభుత్వ మానవవనరుల మంత్రిత్వ శాఖ, పద్మావతి మహిళ బోధన కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో కృష్ణా విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల అధ్యాపకుల ఐదు రోజుల శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం పద్మావతి మహిళా కళాశాలలో నిర్వహించిన ముగింపు సభలో కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ అంకితభావం, నిజాయితీలతో కష్టించి పని చేస్తూ వృత్తికి తగ్గ న్యాయం చేకూర్చాలన్నారు. గ్రామీణాభివృద్ధితోనే దేశాభ్యుదయం జరుగుతుందన్నారు. వివిధ కళాశాలలకు చెందిన సుమారు 25 మంది అధ్యాపకులు మండల పరిధిలోని గోపువానిపాలెం, తాళ్లపాలెం గ్రామాలలో రిసోర్స్‌పర్సన్ ఎం సాయి కిరణ్ నేతృత్వంలో ఆరు బృందాలుగా పర్యటించి ఆ ప్రాంత స్థితిగతులు, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, ఆక్వా కల్చర్, పంచాయతీ వ్యవస్థ, నైసర్గిక పరిస్థితులు, ప్రకృతి వైపరిత్యాలను ఎదుర్కోవడం తదితర అంశాలపై అధ్యయనం చేసి ముగింపు సభలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా విశదీకరించారు. ముగింపుసభ కో-ఆర్డినేటర్, కళాశాల ప్రిన్సిపాల్ డా. వివి శైలజ అధ్యక్షతన జరిగింది.

మంత్రి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పద్మ అరెస్టు, విడుదల
కంచికచర్ల, డిసెంబర్ 3: మంత్రి కొడాలి నానిపై మంగళగిరిలో అనుచితంగా వ్యాఖ్యలు చేసిన యలమంచిలి పద్మను మంగళవారం కంచికచర్ల పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేశారు. మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ మండలంలోని గొట్టుముక్కలకు చెందిన మంగళపూడి ముక్తేశ్వరరావు ఫిర్యాదు చేయగా పద్మపై సీఆర్పీసీ 41 కింద నోటీసు ఇచ్చారు. పద్మను కంచికచర్ల పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చిన తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు కంచికచర్ల స్టేషన్ వద్దకు చేరుకుని పద్మను పరామర్శించి సంఘీభావం తెలిపారు. టీడీపి అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌లపై మంత్రి కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్లనే బాధతో తాను విమర్శించానని ఈ సందర్భంగా పద్మ తెలిపింది. కేసులకు, అరెస్టులకు భయపడేది లేదని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ చంద్రబాబుపై బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి కొడాలి నాని ఇష్టాను రీతిలో బూతులు తిట్టినా ప్రభుత్వం ఆయనపై కేసు నమోదు చేయలేదని అన్నారు.

ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గ్రామోత్సవం
మోపిదేవి, డిసెంబర్ 3: మోపిదేవి శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్టి మహోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారి వసంతోత్సవం, గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల అసిస్టెంట్ కమిషనర్ లీలాకుమార్ స్వామివారి వసంతోత్సవ పూజలను స్వయంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు బద్దు పవన్ కుమార్ శర్మ, అర్చకుడు ఫణి శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ వేద పండితులు నౌడూరి విశ్వనాధ సుబ్రహ్మణ్య శర్మ, కొమ్మూరి ఫణి శర్మ బ్రహ్మత్వంలో స్వామివారి పూర్ణాహుతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారు శేష వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన ఎడ్ల బండిపై స్వామివారి శేష వాహనాన్ని ఏర్పాటు చేసి స్వామివారి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ సూపరింటెండెంట్ మధుసూదనరావు కార్యక్రమాలను పర్యవేక్షించారు.