కృష్ణ

ఇకపై అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ సదరం సర్ట్ఫికెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: సదరం సర్ట్ఫికెట్ల జారీ విషయంలో మధ్యవర్తుల ప్రమేయాన్ని సహించేది లేదని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. ఎవరైనా సదరం సర్ట్ఫికెట్ల కోసం లంచం డిమాండ్ చేస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. సమాజంలో లంచగొండితనం నిర్మూలనకై ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో సదరం సర్ట్ఫికెట్ల జారీ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ సదరం సర్ట్ఫికెట్ల జారీ ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసిందన్నారు. దివ్యాంగులకు సదరం సర్ట్ఫికెట్ల జారీ విషయమై ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వారానికి రెండు రోజులు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సర్ట్ఫికెట్ల జారీకి చర్యలు తీసుకున్నారన్నారు. గతంలో జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రితో పాటు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో మాత్రమే సదరం సర్ట్ఫికెట్లు జారీ చేసే వారన్నారు. దీనివల్ల జిల్లా వ్యాప్తంగా దివ్యాంగులు ఎన్నో కష్టాలు పడి సదరం సర్ట్ఫికెట్లు తీసుకునే వారన్నారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ సదరం సర్ట్ఫికెట్లు జారీ చేసేలా చర్యలు తీసుకుందన్నారు. ఈ నెల 15వతేదీ నుండి అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ సదరం సర్ట్ఫికెట్లు జారీ చేస్తారన్నారు. సర్ట్ఫికెట్ల కోసం దివ్యాంగులు మీ సేవ కేంద్రాల్లో రూ.35లు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎక్కడైనా అధికంగా వసూలు చేస్తే స్పందనలో కానీ తనకు గానీ, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌కు గానీ ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ధృవీకరణ పత్రాల జారీలో మధ్యవర్తుల ప్రమేయం ఉండదని, ఎవరైనా లంచం అడిగితే వారి వివరాలు తమకు తెలియచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. ఎం జయకుమార్, డా. అల్లాడ శ్రీనివాసరావు, ఎఎంసీ మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ బొర్రా విఠల్, మాజీ కౌన్సిలర్ గూడవల్లి నాగరాజు, మాజీ సర్పంచ్ వాలిశెట్టి రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.