కృష్ణ

ప్రతి స్టేషన్‌లోనూ జీరో ఎఫ్‌ఐఆర్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: మహిళలపై జరుగుతున్న దాడులు నేపథ్యంలో వాళ్లకు కవచంలా పోలీసు శాఖ వెన్నంటే ఉంటుందని ఏలూరు రేంజ్ డీఐజీ ఎఎస్ ఖాన్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం ఆయన స్థానిక ఆర్‌పేట పోలీసు స్టేషన్‌తో పాటు బందరు సబ్ డివిజన్ పోలీసు అధికారి వారి కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐజీ ఖాన్ మాట్లాడుతూ అత్యవసర సమయంలో హెల్ప్ లైన్ నెంబర్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. తెలంగాణలో దిశా హత్యతో వెలుగులోకి వచ్చిన జీరో ఎఫ్‌ఐఆర్‌ను పటిష్టవంతంగా అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఏదైనా ప్రదేశంలో అనుకోని సంఘటన జరిగినా, నేరానికి పాల్పడినా, రహదారి ప్రమాదం, హత్య, చోరీ ఏదైనా బాధితులు తమకు సమీపంలోని పోలీసు స్టేషన్‌కు వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. నేరం జరిగిన ప్రాంతం ఆ స్టేషన్ పరిధి కాకున్నా జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి సత్వర న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. గతంలో లలిత కుమారి కేసు విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం నమోదు జరగాలని, ఎవరైనా నమోదు చేయకుండా జాప్యం చేస్తే వారిపై శాఖాపరమైన చర్యలకు వెనుకాబోమని హెచ్చరించారు. మహిళల రక్షణ కోసం శక్తి టీమ్‌లను, ఉమెన్ సెల్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కేసుల నమోదు నుండి చార్జీషీటు దాఖలు వరకు పోలీసులు సమర్ధవంతమైన విధులు నిర్వర్తించాలన్నారు. ఈ తనిఖీల్లో బందరు డీఎస్పీ మొహబూబ్ బాషా, ఆర్‌పేట సీఐ వెంకటేశ్వరరావు, బందరు తాలుకా సీఐ కొండయ్య తదితరులు పాల్గొన్నారు.