కృష్ణ

జిల్లాలో ఖాళీ భూముల వివరాలు వెంటనే ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు : ఉగాది రోజున రాష్ట్రంలో ఇళ్ళు లేని పేదలందరికీ నివేశన స్థలాలు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకుని గ్రామీణ ప్రాంతాలలో ఖాళీగా ఉన్న భూముల వివరాలు వెంటనే అందజేయాలని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ఆదేశించారు. తిరువూరు తాహశీల్దారు కార్యాలయంతో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలను బుధవారం ఆయన సందర్శించారు. కార్యాలయం రికార్డులను పరిశీలించారు. మండలంలోని మల్లెల, రోలుపడి, చౌటపల్లి, కోకిలంపాడు, చిట్టేల గ్రామాల్లో వందలాది ఎకరాల మిగులు భూములు ఉన్నట్లు రికార్డుల్లో కనిపిస్తుండగా, పేదల నివేశన స్థలాల పంపిణీకి భూమి అందుబాటులో లేదని ఎందుకు నివేదికలు ఇచ్చారని అధికారులను కలెక్టర్ ఇంతియాజ్ ప్రశ్నించారు. పనితీరు మెరుగుపర్చుకోవాలని సూచించారు. ఖాళీగా ఉన్న భూముల వివరాలు వెంటనే అందజేయాలని ఆదేశించారు. జిల్లాలో నవశకం కార్యక్రమం అమలుకోసం చేపట్టిన సర్వే 98 శాతం పూర్తయిందని అన్నారు. వ్యర్థాల నుండి సంపద తయారీపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు త్వరలో తిరువూరులో నేను సైతం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శాంతినగర్‌లో చెత్త నుండి సంపద తయారీ చేసే కేంద్రాన్ని పరిశీలించారు. నగర పంచాయతీ పరిధిలో చెత్త సేకరణ ఆశించిన స్థాయిలో లేదని, తడి, పొడి చెత్తను వేరుచేయటానికి ప్రజల నుండి సహకారం లేదని కమిషనర్ శ్రీకాంత్‌రెడ్డి కలెక్టర్ ఇంతియాజ్‌కు తెలిపారు. ఈ విషయంపై ప్రజలను చైతన్యవంతులను చేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు అవసరమైన లబ్ధిదారుల జాబితాలను తయారుచేసే సమయంలో ఎటువంటి పక్షపాతం, నిర్లక్ష్యం వహించవద్దని అధికారులకు చెప్పారు. అరుదైన వ్యాధులకు గురైన వారికి పెన్షన్ మంజూరు చేసేందుకు జిల్లాలో సర్వే చేస్తున్నట్లు చెప్పారు. పాత తిరువూరు లో అసంపూర్తిగా నిలిచిపోయిన పక్కా గృహ సముదాయాలను త్వరితగతిన పూర్తి చేసి పేదలకు పంపిణీ చేయాలని మాజీ శాసనసభ్యుడు నల్లగట్ల స్వామిదాసు కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తాహశీల్దారు స్వర్గం నరసింహారావు, సర్వేయర్ సారంగపాణి, ఆర్‌ఐ శరిషారాణి, ఇన్‌చార్జి ఎంపిడిఒ నాగేశ్వరరావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.