కృష్ణ

24బిఎన్‌టి 2: దిగబడిన ఓఎన్‌జిసి భారీ వాహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంటుమిల్లి, జూన్ 24: ఓఎన్‌జిసి భారీ వాహనాల తరలింపు కారణంగా శుక్రవారం బంటుమిల్లిలో తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. కృత్తివెన్ను మండలం చినపాండ్రాక ఓఎన్‌జిసి రిగ్గు నుండి బంటుమిల్లి మండలం పెందూరు రిగ్గుకు ఓఎన్‌జిసి భారీ వాహనాలను శుక్రవారం తరలించారు. దీనిలో భాగంగా ఒక భారీ వాహనం బంటుమిల్లిలోని 216 జాతీయ రహదారిలో పోలీసు స్టేషన్ సమీపంలో టర్నింగ్‌లో దిగబడింది. ఈ భారీ వాహనాన్ని క్రెయిన్ల సహాయంతో తరలించారు. ఈ సందర్భంగా అడ్డు వచ్చిన విద్యుత్ స్తంభాలను తొలగించి అనంతరం ఏర్పాటు చేశారు. విద్యుత్‌ను ఎఇ భానుప్రకాష్ యుద్ధప్రాతిపదికన విద్యుత్‌ను పునరుద్ధరించారు. ఉదయం నుండి సాయంత్ర వరకు విద్యుత్ నిలిచిపోవటంతో వివిధ కార్యాలయాలలో పనులకు అంతరాయం ఏర్పడింది.