కృష్ణ

జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కి నూజివీడు స్టేషన్‌లో హాల్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనుమాన్ జంక్షన్, జూన్ 30:హనుమాన్ జంక్షన్, నూజివీడు ప్రాంతాల ప్రజల చిరకాల కోరిక త్వరలో నెరవేరనుంది. స్థానిక నూజివీడు రైల్వేస్టేషనులో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ళను నిలుపుదల చేయాలని కోరుతున్న నేపథ్యంలో తెలుగుదేశం నేతలు గత ఏడాది రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్ కల్పించడంలో విజయం సాధించారు. తాజాగా నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు అట్లూరి రమేష్ జన్నభూమి ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్ కల్పించడం కొరకు చేసిన ప్రయత్నం కార్యరూపం దాల్చింది. ఎపి నుంచి రాజ్యసభకు ఎన్నికైన రైల్వే మంత్రి సురేష్‌ప్రభును అట్లూరి రమేష్ గురువారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు. నూజివీడు రైల్వే స్టేషను పరిస్థితిని వివరిస్తూ గతంలో చేసిన వినతిపత్రాలను పరిశీలించాలని అట్లూరి సురేష్‌ప్రభును కోరారు. దీంతో అయన జూలై 7 నుంచి నూజివీడు రైల్వేస్టేషనులో జన్నభూమి ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశిస్తూ సురేష్‌ప్రభు ఉత్తర్వులు జారీ చేసినట్లు రమేష్ స్థానిక విలేఖర్లకు తెలిపారు. 7వ తేదీన విశాఖపట్నంలో బయలుదేరిన జన్నభూమి ఎక్స్‌ప్రెస్ 12085 నూజివీడు స్టేషనులో 10:45కి ఆగుతుంది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే జన్నభూమి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ నెంబరు 12086 నూజివీడు స్టేషనులో 2:15కి ఆగుతుంది. స్టేషనులోని వౌలిక వసతుల కల్పనకు సైతం తగిన చర్యలు తీసుకోవాలని అట్లూరి రమేష్ కోరారు. 7న విశాఖపట్నం నుంచి వచ్చే జన్నభూమికి స్థానిక నాయకులు వేములపల్లి శ్రీనివాసరావు, చలసాని అంజనేయులు, ఆళ్ళ గోపాలకృష్ణ, వేగిరెడ్డి పాపారావు, మండల పరిషత్ అధ్యక్షురాలు తుమ్మల కోమలి స్వాగతం పలకనున్నారు.