కృష్ణ

స్వయం కృషితోనే జీవితంలో ఎదుగుదల సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చల్లపల్లి, ఏప్రిల్ 5: స్వయం కృషితోనే జీవితంలో ఎదుగుదల సాధ్యమని రాష్ట్ర అదనపు డిజిపి ఆర్‌పి ఠాకూర్ అన్నారు. దత్తత తీసుకున్న పురిటిగడ్డ వచ్చిన ఆయన గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. పంచాయతీ కార్యాలయంలో జిల్లా పోలీసు సూపరింటెండెంట్ విజయ కుమార్, అవనిగడ్డ డిఎస్పీ ఖాదర్ బాషా, ఎంపిపి యార్లగడ్డ సోమశేఖర ప్రసాద్, తదితరులతో సమావేశమై సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 22వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో గ్రామంలోని నిరుద్యోగ యువత ఉద్యోగాలు సాధించేందుకు అవసరమైన శిక్షణ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థి దశలో కష్టపడితే మిగిలిన జీవితం సుఖంగా ఉంటుందన్నారు. గ్రామ పంచాయతీకి మరిన్ని నిధులు విడుదలయ్యేందుకు తనవంతు కృషి చేస్తానని ఠాకూర్ తెలిపారు. నిమ్మగడ్డ దళితవాడలో దాతలు విరాళంగా ఇచ్చిన స్థలంలో నిర్మిస్తున్న పాఠశాల భవనాన్ని ఆయన పరిశీలించారు. నీరు-చెట్టు ద్వారా పాఠశాల ఆవరణ మెరక పనులు చేపట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఎస్పీ విజయ కుమార్ మాట్లాడుతూ పోలీసు శాఖలో పనిచేసేందుకు ఆసక్తి ఉండే యువతకు పురిటిగడ్డ జెడ్పీ హైస్కూల్‌లో ఫిజికల్ టెస్ట్ నిర్వహించి చల్లపల్లిలో శిక్షణ ఇప్పిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటిసి కృష్ణకుమారి, సర్పంచ్ పరుచూరి సురేష్, ఎంపిటిసి దేవభక్తుని గోపాలకృష్ణ పాల్గొన్నారు.