కృష్ణ

చాగంటిపాడులో అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, జూలై 8: మండలంలోని చాగంటిపాడు కొత్త కాలనీలో శుక్రవారం 11 గంటల సమయంలో సంభవించిన అగ్నిప్రమాదంలో యరపాలెపు లక్ష్మీకి చెందిన పూరిల్లు దగ్ధమైంది. యరపాలెపు లక్ష్మీ పూరింటిలో చాట్రగడ్డ రామతులసి అద్దెకు ఉంటోంది. రామతులసి పొలం పనికి వెళ్ళిన సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. బలమైన గాలి వీస్తుండటంతో మంటలు ఇల్లంతా చుట్టుముట్టాయి. దీంతో స్థానికులు దగ్గరకు వెళ్ళలేకపోయారు. మంటలు అంటుకున్న కొద్దిసేపటికే ఇంటిలోని గ్యాస్‌బండ పేలి మూడు ముక్కలు 50 మీటర్ల దూరంలో పడి వేరేవ్యక్తుల ఇళ్ళవద్ద దడులు అంటుకుని కాలాయి. గ్యాస్‌బండ పేలుడు శబ్దానికి భయపడి పోయారు. ఇంటిలో ఒక్కవస్తువు కూడా బయటకు తీయలేకపోయారు. ఇంటిలో ద్విచక్ర వాహనం, సైకిల్, వంట సామాగ్రి, వస్త్రాలు, బంగారు నగలు, అపరాలు, బియ్యం కాలిబూడిదయ్యాయి. సమాచారం తెలుసుకుని పొలం నుంచి ఇంటికి వచ్చిన రామతులసి బూడిదగా మారిన ఇల్లుని చూసి బోరున విలపించింది. రూ.1.50 లక్షలు నష్టం వాటిల్లినట్టు విఆర్‌ఓ కె వీరాస్వామి తెలిపారు. ఎంపిపి కళ్ళం వెంకటేశ్వరరెడ్డి బాధితురాలికి రూ.3వేలు వ్యక్తిగత ఆర్థిక సహాయం అందించారు. మర్రెడ్డి రవిరెడ్డి రూ.2వేలు సహాయం అందజేశారు.