కృష్ణ

ప్రభుత్వ భూదోపిడీని అడ్డుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూలై 10: ఓడరేవు, కోస్టల్ కారిడార్ పేరుతో ప్రభుత్వం బలవంతపు భూసేకరణకు సిద్ధమవుతున్న తరుణంలో ఏ ఒక్క రైతు కూడా అధైర్యపడి ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రభుత్వ మాజీ విప్ పేర్ని వెంకట్రామయ్య (నాని) కోరారు. రైతుల పక్షాన పోరాడేందుకు భూపరిరక్షణ పోరాట సమితి సిద్ధంగా ఉందని ఆదివారం స్థానిక సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 12న ఉదయం 10గంటలకు గాడెల్లి కల్యాణ మండపంలో రైతుల్లో మనోధైర్యం కల్పించేందుకు సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పక్షాల నేతలతో పాటు మేధావులు హాజరై భూసమీకరణ వల్ల రైతులకు జరిగే నష్టాన్ని వివరించి వారిని చైతన్యవంతుల్ని చేస్తామన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, పిసిసి ఉపాధ్యక్షులు దేవినేని నెహ్రూ, వైసిపి నుండి ధర్మాన ప్రసాదరావు, రిటైర్డు న్యాయమూర్తులు, పర్యావరణ పరిరక్షణ ప్రముఖులు ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు పేర్ని తెలిపారు. భూపరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ కొడాలి శర్మ మాట్లాడుతూ గత ఏడాది ఆగస్టులో ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దుచేసి 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూములు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులతో కలిసి పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో భూపరిరక్షణ పోరాట సమితి ప్రతినిధులు యద్దనపూడి సోని, దేవభక్తుని నిర్మల, అబ్దుల్ మతీన్, లంకే వెంకటేశ్వరరావు, మారుమూడి విక్టర్ ప్రసాద్ పాల్గొన్నారు.