కృష్ణ

కాపు కార్పొరేషన్ ద్వారా గ్రూప్ రుణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూలై 17: కాపు సామాజిక వర్గానికి చెందిన పేదలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ మేరకు కాపు కార్పొరేషన్ ద్వారా రూ.25లక్షల మేర గ్రూప్ రుణాలు మంజూరు చేయనున్నారు. జిల్లాలో 100 గ్రూపులను ఏర్పాటు చేసి రూ.25 కోట్ల మేర రుణాలు ఇచ్చేందుకు కాపు కార్పొరేషన్ అధికారులు కార్యాచరణ ప్రణాళిక తయారు చేశారు. చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమల స్థాపనకు ఈ రుణాలను అందించనున్నారు. ముగ్గురు నుండి ఐదుగురు ఒక గ్రూప్‌గా ఏర్పడి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కార్పొరేషన్ ఇచ్చే రూ.25లక్షలలో రూ.10లక్షలు సబ్సిడీ కాగా రూ.10లక్షలు బ్యాంక్ రుణంగా ఇస్తారు. మిగిలిన రూ.5లక్షలు 20శాతం మార్జిన్ మనీ కింద లబ్ధిదారుని వాటాగా నిర్ణయించారు. 21-50 సంవత్సరాల లోపు వయస్సు గల వారు ఈ పథకానికి అర్హులు. ఒక్కొక్క అభ్యర్థి వార్షిక ఆదాయం రూ.6లక్షలు మించి ఉండకూడదు. పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. గ్రూపులోని ఏ ఒక్క సభ్యుడు ఏదేని బ్యాంక్ నుండి ఋణము పొంది బకాయి పడి ఉండకూడదు. గతంలో గానీ, ప్రస్తుత ప్రభుత్వము నుండి ఏ విధమైన సబ్సిడీ ఋణము పొంది ఉండకూడదు. అభ్యర్థులు గ్రూప్‌గా ఏర్పడి అనుభవం, నైపుణ్యం కలిగిన పరిశ్రమను ఎంచుకోవల్సి ఉంటుంది. సదరు యూనిట్ కొరకు ఆర్థిక సాయం పొందేందుకు గాను ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. స్వయంగా ధృవీకరించిన జనన ధృవీకరణ పత్రము, పదవ తరగతి సర్ట్ఫికెట్, కలర్ పాస్ పోర్టుసైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు జిరాక్స్, తహశీల్దార్ జారీ చేసిన కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు, వృత్తి నైపుణ్య సర్ట్ఫికెట్, గ్రూప్‌లోని వ్యక్తుల సంతకం చేసిన డిక్లరేషన్ ఫారం, పార్టనర్‌షిప్ డీడ్ జిరాక్స్‌ను దరఖాస్తుతో జత చేయాలి. ఈ నెల 25వతేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నూతన పథకం వివిధ రంగాల్లో నైపుణ్యం కలిగిన పేద కాపులకు కొంత వెసులుబాటు కల్పించేలా ఉన్నప్పటికీ ఆచరణలో ఎంత వరకు సఫలీకృత సాధిస్తారనేది ప్రశ్నార్ధకంగా మారింది. రూ.10లక్షల మేరకు రుణం ఇచ్చేందుకు బ్యాంకర్ల సహకారం ఏ మేర ఉంటుందో తెలియని పరిస్థితి. కాపు కార్పొరేషన్ ద్వారా అందిస్తున్న రూ.50 నుండి రూ.2లక్షల వరకు వ్యక్తిగత రుణాలకే బ్యాంకర్ల నుండి సహకారం కరువైంది. ఈ క్రమంలో రూ.10లక్షలు బ్యాంక్ రుణం ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు వస్తారా? రారా? అనేది వేచి చూడాల్సిందే.