కృష్ణ

కరవు రహిత రాష్ట్రం లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 7: వ్యవసాయం, వాతావరణ పరిస్థితులు, నూతనంగా చేపట్టే ఆరోగ్య కార్యక్రమాలు, వడగాలుల సందర్భంలో ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు చేపట్టవలసిన చర్యలు, తాగునీటి ఎద్దడి నివారణ పద్ధతులు, ఇసుక, రెవెన్యూ సంస్కరణలు, జాతీయ ఉపాధి హామీ పథకం, ధాన్యం కొనుగోలు అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కలెక్టర్ బాబు.ఏ పాల్గొన్నారు. కరువు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఏప్రిల్, మే నెలల్లో జిల్లాలు పర్యటించి, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహణ, వాటిలో పాల్గొంటానని జల సంరక్షణా పద్ధతులను అమలు చెయ్యాలని స్పష్టం చేసారు. కృష్ణాజిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు 4 టిఎంసిలను కృష్ణా బోర్డును కోరడం జరిగిందని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. 3 టిఎంసిలు ఆంధ్రకు, ఒక టిఎంసి నల్గొండకు విడుదల చేశారన్నారు. ఆంధ్రకు విడుదల చేసిన 3 టిఎంసిల్లో 2 టిఎంసిలు కృష్ణాజిల్లాలోని మెట్ట ప్రాంతానికి, ఒక టిఎంసి గుంటూరుకు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. మరో 4 టిఎంసిలను కోరామని తెలిపారు. పెడన, కైకలూరు ప్రాంతాల్లో కొంతమేర ఇబ్బందులు ఉన్నాయని, అందుకు అనుగుణంగా పరిష్కార చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు. జిల్లాలో చలివేంద్రాలను నిర్వహిస్తున్నామని కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. జిల్లాలోని 420 చెరువులకు గాను 72 చెరువుల్లో 25 శాతం కంటే తక్కువ నీరు ఉందని, సమన్వయ శాఖల ద్వారా మచిలీపట్నం ఏరియాలో చెరువులు నింపేందుకు చర్యలు సమర్ధవంతంగా చేపడుతున్నట్లు కలెక్టర్ వివరించారు. జిల్లాలో చలివేంద్రాలను నిర్వహిస్తున్నామని కలెక్టర్ బాబు.ఎ తెలిపారు.