కృష్ణ

ఫిరాయింపుదార్లు తిరిగిరాక తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, జూలై 24: తెలుగుదేశం పార్టీలో చేరిన వైకాపా నాయకులు అక్కడ ఇమడలేక తిరిగి తమ పార్టీలోకి వస్తారని పామర్రు శాసనసభ్యురాలు ఉప్పులేటి కల్పన అన్నారు. మొవ్వ మండల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సీతామహాలక్ష్మి ఫంక్షన్ హాలులో పార్టీ మండల అధ్యక్షులు రాజులపాటి రాఘవరావు అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రానున్న 18నెలలు వైకాపా నాయకులు, కార్యకర్తలకు అగ్నిపరీక్ష లాంటివన్నారు. రానున్న ఎన్నికల్లో వైకాపా గెలుపునకు తీవ్రంగా కృషిచేసి జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు విశ్రమించవద్దని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్నికల సందర్భంగా ముఖ్యమంతి చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలు అమలుపర్చలేదని ఆమె విమర్శించారు. ప్రజలు రానున్న ఎన్నికల్లో టిడిపికి బుద్ధిచెప్పాలన్నారు. పెడన నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి ఉప్పాల రాంప్రసాద్ మాట్లాడుతూ హౌసింగ్ బోర్డు ఛైర్మన్‌గా నియమితులైన వర్ల రామయ్య రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడా పక్కా గృహం మంజూరు చేయలేదని విమర్శించారు. గత ఎన్నికల్లో బిసిలకు అధిక ప్రాధాన్యతనిచ్చింది వైకాపానే అన్నారు. పార్టీ వీడిన నాయకులు తిరిగి వైకాపా గూటికి చేరే అవకాశం ఉందన్నారు. ఇటీవల మృతి చెందిన పార్టీ సీనియర్ నాయకులు వీరంకి యజ్ఞనారాయణ స్మృతికి సంతాపంగా రెండు నిమిషాలు వౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో జెడ్పీ ఫ్లోర్‌లీడర్ తాతినేని పద్మావతి, జెడ్పీటిసి చిమటా విజయశాంతి, జిల్లా ప్రధాన కార్యదర్శి గోగినేని పెరుమాళ్ళు, ఎస్సీ సెల్ నాయకులు ఎన్ రమేష్, పుల్లారావు, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.