కృష్ణ

ముదిరిపోతున్న నారుమడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), జూలై 31: ఈ ఏడాది కూడా రైతన్నలను ఖరీఫ్ సాగు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. పంట కాలువల్లో అరకొరగా వదిలిన నీటిని రాత్రీ పగలు తేడాలేకుండా డీజిల్ ఇంజన్ల సహాయంతో తోడి నాట్లు వేస్తున్నారు. వ్యవసాయానే్న జీవనాధారంగా చేసుకున్న జిల్లా రైతన్నలు ఖరీఫ్ సాగు చేసేందుకు నానా అవస్థలు పడుతున్నారు. జూన్‌లో వచ్చిన వర్షాలకు వేసిన నారుమడులు నాట్లుకు సిద్ధం కావటంతో కాలువలకు వదిలిన అరకొర నీటిని ఇంజన్ల సహాయంతో తోడి మరీ నాట్లు వేస్తున్నారు. నారు ముదిరిపోతే దిగుబడి గణనీయంగా తగ్గుతుందన్న ఆందోళనలో ఉన్న రైతన్నలు అధిక వ్యయం ఖర్చు చేసి అయినా సాగు చేస్తున్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఆకుమడులు చనిపోవటంతో వరినారుకు తీవ్ర గిరాకీ ఏర్పడింది. సెంటు నారు ధర రూ.500 నుంచి రూ.800 వరకు పలుకుతోంది. అయినాసరే కొని వరుణ దేవునిపై భారం వేసి నాట్లు వేస్తున్నారు. కాలువల్లో అరకొరగా నీరు వచ్చినా ధైర్యం చేసి ఆ నీటితోనే భూమిని తడుపుతున్నారు. ఆ తరువాత దేవుడే దిక్కని రైతన్నలు పేర్కొంటున్నారు. జిల్లాలోని ఏ మండలంలో చూసినా ఇదే పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా కాలువలపై డీజిల్ ఇంజన్లు దర్శనమిస్తున్నాయి. బందరు మండలంలో శనివారం కురిసిన భారీ వర్షానికి వ్యవసాయ భూములు నీటితో నిండటంతో కొందరు రైతులు నాట్లు వేస్తున్నారు. పంటబోదెలు, చెరువులు, గుంటల్లో ఉన్న నీటిని సైతం డీజిల్ ఇంజన్ల సహాయంతో తోడుతున్నారు. అడపాదడపా వర్షాలు పడటంతో ఇప్పటికే నాట్లు వేసిన వరి పొలాలు పచ్చబడ్డాయి. బోర్ల సదుపాయం ఉన్న ప్రాంతాలకు నీటి సమస్య లేకపోయినా కాలువల కింద సాగు చేసే రైతులు మాత్రం సాగునీరు అందక లబోదిబోమంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో పంట కాలువల్లో కూడా నీరు లేకపోవటంతో నారు ముదిరిపోతుందని ఆందోళన చెందుతున్నారు. అలాగే ఆటుపోటు ఉన్న డ్రైన్లలో ఉప్పునీరు ఉండటంతో ఆయా కాలువలపై ఆధారపడి సాగుచేసే వేలాది ఎకరాలు నీటికోసం ఎదురు చూస్తున్నాయి. నాలుగు రోజులు పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిస్తే డ్రైన్లలోని ఉప్పునీరు తీపిగా మారుతుందని రైతులు అంటున్నారు. కానీ వర్షం మాత్రం అనుకున్నంతగా కురవకపోవటంతో నిరుత్సాహానికి గురవుతున్నారు. ప్రస్తుతం జిల్లాలోని వ్యవసాయ భూములకు సాగునీరు అందించే అవకాశం లేదు. కానీ వరుణదేవుడు ఒక వారం రోజులు కరుణిస్తే జిల్లాలోని మొత్తం వ్యవసాయ భూముల్లో నాట్లు పడి పచ్చగా దర్శనమిస్తాయనడంలో సందేహం లేదు.