కృష్ణ

2.4 కోట్లతో 102 మరుగుదొడ్ల నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఆగస్టు 7: నగరంలో బహిరంగ మల, మూత్ర విసర్జన చర్యలను పూర్తిగా నియంత్రించేందుకు విఎంసి ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్, కమిషనర్ వీరపాండియన్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం ఇందిరాగాంధీ స్టేడియం వద్ద నూతనంగా నిర్మించిన నమ్మా టాయ్‌లెట్లను పరిశీలించిన కమిషనర్ వీరపాండియన్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన స్వచ్చ్భారత్ కార్యక్రమాన్ని నగరంలో విజయవంతం చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా నగర వ్యాప్తంగా పలుచోట్ల యూనివర్శిల్ డిజైన్‌తో కూడిన మరుగుదొడ్లను నిర్మిస్తున్నామన్నారు. మొత్తం 2.4కోట్ల నిధులతో 102 మరుగుదొడ్లను నిర్మించనున్నామన్నారు. అలాగే నగరంలో అమలుచేసిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పథకాన్ని 97శాతం అమలుచేసి మొత్తం 1505 మరుగుదొడ్లను నిర్మించి రాష్ట్రంలోనే రెండవ స్థానంలో నిలిచామన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న యూనివర్శివల్ డిజైన్ మరుగుదొడ్లలో నిరంతర నీటి సరఫరా, సోలార్ లైటింగ్ వ్యవస్థతోపాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సదుపాయాలను కూడా కల్పిస్తున్నామని తెలిపారు. ఈకార్యక్రమంలో కార్పొరేటర్ నజీర్ హుస్సేన్, ఇఇ గోవిందరావు, రీజనల్ ఫైర్ ఆఫీసర్ చౌదరి పాల్గొన్నారు.