కృష్ణ

పుష్కర ఘాట్‌లకు పోటెత్తిన భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఆగస్టు 16: జిల్లాలోని పుష్కర ఘాట్‌లు భక్తులతో కళకళలాడుతున్నాయి. కృష్ణా పుష్కరాల్లో ఐదవ రోజైన మంగళవారం లక్షలాది మంది భక్తులు పవిత్ర పుణ్య స్నానాలు ఆచరించారు. జిల్లాలోని అన్ని పుష్కర ఘాట్‌లు భక్తజన సంద్రంగా మారాయి. రాష్ట్రంలోని నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున పుష్కర స్నానాలు ఆచరించేందుకు తరలి వస్తున్నారు. కృష్ణానదీ తీరం భక్తజన సందోహంతో సందడిగా మారింది. వేకువ జాము నుండి సాయం సంధ్యా వేళ వరకు భక్తులు రాకపోకలు కొనసాగుతున్నాయి. ఆర్టీసి ప్రత్యేకంగా నడుపుతున్న సర్వీసులతో పాటు వేలాది ప్రైవేట్ వాహనాలు పుష్కర బాట పట్టాయి. పుణ్య స్నానాలు ఆచరించే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు క్షణం క్షణం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పుష్కర ఘాట్‌ల వద్ద అన్ని వసతులు కల్పించారు. భోజన వసతితో పాటు మంచినీరు, మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ నిరంతరాయంగా కొనసాగుతోంది. పవిత్ర సాగర సంగమం హంసలదీవి భక్తులతో పోటెత్తింది. నాగాయలంక శ్రీరామపాద క్షేత్రం కూడా భక్తులతో కిక్కిరిసింది. ఆయా ఘాట్‌ల వద్ద భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. హంసలదీవి వేణుగోపాలుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే శ్రీరామపాదక్షేత్రం వద్ద కొలువైయున్న శ్రీరామాలయం, శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి, శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీ కనకదుర్గా దేవి ఆలయం, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వార్లను దర్శించి పునీతులయ్యారు. కృష్ణానది ఉత్తర వాహినిగా ప్రవహించే పెదకళ్ళేపల్లి శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్న పుష్కర ఘాట్, ఘంటసాల మండలం శ్రీ కాకుళేశ్వర స్వామి ఆలయం సమీపాన ఉన్న శ్రీకాకుళం పుష్కర ఘాట్‌లకు భక్తుల తాకిడి ఏ మాత్రం తగ్గలేదు. నిత్యం వేలాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. అవనిగడ్డ, చల్లపల్లి, మోపిదేవి, ఘంటసాల, తోట్లవల్లూరు, పమిడిముక్కల మండలంలోని పలు పుష్కర ఘాట్‌లలో భక్తుల రద్దీ కనిపించింది. పితృదేవతలకు పిండ ప్రదానాలు నిర్వహించుకున్నారు. మహిళలు మూసి వాయనాలు ఇచ్చి పుచ్చుకున్నారు.