కృష్ణ

విద్య, ఉపాధితోనే పేదరిక నిర్మూలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం/మైలవరం, ఆగస్టు 17: విద్య, ఉపాధి రంగాలలో మెరుగైన ఫలితాలు సాధించినప్పుడే పేదరిక నిర్మూలన సాధ్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కృష్ణా పుష్కరాల ఆరో రోజైన బుధవారం ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం ఘాట్ వద్ద కృష్ణమ్మకు హారతినిచ్చే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా ప్రసంగించారు. ఇక్కడ జరుగుతున్న రోజుకొక అంశంలో భాగంగా విద్య, ఉపాధి అంశంపై ఆయన ప్రసంగించారు. సంపూర్ణ అక్షరాస్యతే అభివృద్ధికి తొలిమెట్టని అది సాధించిన దేశాలు అభివృద్ధి చెందాయని వాటికి ధీటుగా తయారవ్వాలంటే తల్లిదండ్రులంతా తమ పిల్లలను చదివించాలన్నారు. అందుకు తాను వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దే బాధ్యతను తీసుకుంటానన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలకు ఇవ్వాల్సింది కోట్లాది రూపాయల ఆస్తి కాదని పరిపూర్ణమైన విద్య అన్నారు. పిల్లలను చదివించని తల్లిదండ్రులు వారికి ద్రోహం చేసిన వారవుతారన్నారు. ఎందరో మట్టిలో మాణిక్యాలున్నాయని వారిని గుర్తించి వారి ద్వారా అద్భుత ఫలితాలు సాధించవచ్చన్నారు. ఇందుకోసం పదివేల మంది టీచర్లను నియమించామన్నారు. విద్యకు ఏటా 21వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని వెల్లడించారు. మధ్యాహ్న భోజనం పెడుతున్నామని, పాఠశాలల్లో అవసరమైన అన్ని వౌలిక వసతులు కల్పిస్తున్నామని, ఫీజు రీయింబర్స్‌మెంట్ అందిస్తున్నామని, దుస్తులు పుస్తకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రైవేటుకు ధీటుగా మెరుగైన ఫలితాలు సాధించాలన్నదే తన తపన అన్నారు. టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నానని, రాబోయే రోజులలో ప్రపంచ దేశాలలో రాష్ట్రానికి తగిన గుర్తింపు తీసుకురావటమే తన లక్ష్యమన్నారు. రాబోయే రోజులలో అన్ని స్కూల్స్‌లో ఎలక్ట్రానిక్ తరగతులు పెట్టబోతున్నట్లు ప్రకటించారు. టీచర్లకు శిక్షణ ఇవ్వటంతోపాటు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. కార్పొరేట్ స్థాయి విద్యను ప్రభుత్వ స్కూల్స్, కళాశాలల్లో అందించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. ప్రపంచంలోని పేరొందిన విద్యాకేంద్రాలను రాష్ట్ర విద్యాసంస్థలకు అనుసంధానం చేసి హైటెక్నాలజీ విద్యను ఇక్కడి విద్యార్థులకు అందించే మహత్తరమైన కార్యక్రమాన్ని చేపటుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర విభజన వల్ల విద్యపరంగా తీవ్రంగా నష్టపోయామని వాటిని భర్తీ చేసే చర్యలు తీసుకుంటునట్లు పేర్కొన్నారు. ఇందుకోసం అవసరమైన యూనివర్శిటీలను, విద్యాకేంద్రాలను నెలకొల్పుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక్కడ అవకాశం లేకపోతే విద్యార్థులను విదేశాలకు పంపి అక్కడ చదివిస్తున్నానన్నారు. కూచిపూడి నాట్యాన్ని ప్రపంచం గుర్తించినా మనం మాత్రం మర్చిపోయామని, దానికి పూర్వవైభవం తీసుకొస్తానని ప్రకటించారు. విద్యార్థులూ మీరు బాగా చదవండి మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యతను నేను తీసుకుంటానని వారికి భరోసా ఇచ్చారు. విద్యార్థులకు చదవుతోపాటు ఉద్యోగాలు సాధించటానికి అవసరమైన స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలను నెలకొల్పి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగాలు సంపాదించటానికి అవసరమైన చర్యలను చేపట్టినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పటికే 20వేల ఉద్యోగాల నియామకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఇంజనీరింగ్, ఐటి రంగాలను అభివృద్ధి చేస్తున్నానని, రాష్ట్రానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తేవటమే తన లక్ష్యమని పునరుద్ఘాటించారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ నాదెండ్ల సత్యం మనవాడేనని అతను అందరికీ ఆదర్శంగా కావాలన్నారు. అతని జీతం ఏడాదికి ఐదొందల కోట్ల రూపాయలని తల్లిదండ్రులకు అంతకన్నా ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. విద్యార్థులు బాగా చదివి తనకు సహకరిస్తే నీతివంతమైన, సమర్థవంతమైన పాలన అందిస్తానని ఆయన శపథం చేశారు. అనంతరం విద్యార్థినీ, విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా విద్యలో రాణించిన విద్యార్థినీ, విద్యార్థులను సన్మానించి బహుమతులు అందించారు. ఈకార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ గురూజీ, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, స్పీకర్ కోడెల శివప్రసాద్, పలువురు రాష్ట్ర మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.