కృష్ణ

కృష్ణమ్మా.. అందుకో మా వందనాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఆగస్టు 23: తెలుగు ప్రజల కల్పవల్లి కృష్ణమ్మకు అశేష భక్తజనులు వందనాలు సమర్పించారు. కృష్ణమ్మ చెంత పనె్నండు రోజుల పాటు విశేష పూజలు అందుకున్న పుష్కరుడుకి ఘనంగా వీడ్కోలు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కృష్ణా పుష్కరాలు అట్టహాసంగా ముగిశాయి. పనె్నండు రోజుల పాటు భక్తజనుల విశేష పూజలందుకున్న కృష్ణవేణమ్మకు చివరిరోజైన మంగళవారం అత్యంత భక్తిశ్రద్ధలతో నీరాజనాలు పలికారు. కృష్ణమ్మ పాదాలు మోపిన పవిత్రక్షేత్రం సాగర సంగమం, నాగాయలంక శ్రీరామపాద క్షేత్రం, ముక్త్యాల, వేదాద్రి, పెదకళ్ళేపల్లి, శ్రీకాకుళం పుష్కర ఘాట్లలో భక్తిశ్రద్ధలతో కృష్ణానదికి హారతులిచ్చారు. శ్రీరామపాద క్షేత్రం వద్ద నిర్వహించిన కుంభహారతిని వీక్షించేందుకు వేలాది మంది భక్తులు హాజరయ్యారు. విశ్వయోగి విశ్వంజీ మహరాజ్‌తో పాటు శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య కృష్ణవేణి విగ్రహానికి నవ హారతులిచ్చారు. ఇదిలావుండగా పుష్కరాల్లో చివరిరోజైన మంగళవారం జిల్లాలోని అన్ని పుష్కర ఘాట్లు, నగర్‌లు భక్తులతో కిటకిటలాడాయి. భక్తజనులతో కృష్ణాతీరం జనసాగరమైంది. ఘాట్లలో కిక్కిరిసిపోయి మరీ భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం తమ పితృదేవతలకు పిండప్రదానాలు చేశారు. వేకువఝాము నుండి పుష్కర ఘాట్లకు భక్తుల తాకిడి ఎక్కువైంది. సాయంసంధ్యా సమయం వరకు భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అనంతరం నిర్వహించిన హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణ నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి సైతం వేలాది మంది భక్తులు పుష్కర స్నానం ఆచరిచేందుకు భారీగా తరలివచ్చారు. ప్రసిద్ధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ముగింపు సందర్భంగా పలు ప్రాంతాల్లో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను రంజింపజేశాయి. అవనిగడ్డలో శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన జానపద కళాప్రదర్శనలు, పగటి వేషాలు, విచిత్ర వేషధాణలు, పులివేషాలు భక్తులను అలరించాయి. ఈ నెల 12న ప్రారంభమైన పుష్కరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగియటంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసి ప్రజల మన్ననలు పొందారు. ప్రభుత్వ యంత్రాంగంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థిలోకం విశేష సేవలు అందించింది. పుష్కర ఘాట్ల వద్ద ప్రభుత్వపరంగానే కాకుండా స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో లక్షలాది మంది భక్తులకు భోజన వసతి కల్పించారు. ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం భోజనాలు పెట్టి భక్తుల ఆకలి తీర్చారు. నిరంతరాయంగా మంచినీళ్లు, మజ్జిగ పంపిణీ చేసి ప్రజల మన్ననలు పొందారు. మొత్తమీద పనె్నండు రోజులు సాగిన కృష్ణా పుష్కరాలు జిల్లాలో నూతన ఒరవడిని సృష్టించాయి.