కృష్ణ

బంటుమిల్లి కాల్వకు సాగునీరివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంటుమిల్లి, ఆగస్టు 25: బంటుమిల్లి ప్రధాన కాల్వకు సాగునీరు, తాగునీరు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం, రైతు సంఘాల ఆధ్వర్యంలో స్థానిక గ్రామ పంచాయతీ ఆఫీసు వద్ద గురువారం రిలే దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాగంటి హరిబాబు ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా డెల్టాలోని 13లక్షల ఎకరాలకు 60శాతం మేరకు సాగు వివిధ దశల్లో ఉందని, బంటుమిల్లి ప్రధాన కాల్వకు చుక్కునీరు రాకపోవటంతో బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూన్ 10న పట్టిసీమ నీరు వదులుతున్నట్లు ప్రకటించటంతో రైతులు సాగుకు ఉద్యుక్తులయ్యారని, నేటికీ చుక్కనీరు రాలేదని వాపోయారు.
ముఖ్యమంత్రి మాటలు నీటిమూటలయ్యాయని ధ్వజమెత్తారు. గుడ్లవల్లేరు లాకుల వద్ద ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు గౌరిశెట్టి నాగేశ్వరరావు, పి భోగేశ్వరరావు, అజయ్ ఘోష్, పి మోహనరావు, ముల్లపర్రు, పెందూరు రైతులు పాల్గొన్నారు.