కృష్ణ

పులిగడ్డ అక్విడెక్ట్‌కు వరద ఉద్ధృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, సెప్టెంబర్ 1: మండల పరిధిలోని పులిగడ్డ అక్విడెక్ట్‌కు వరద నీరు చేరటంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుండి వరద నీరు వదలటంతో పులిగడ్డ అక్విడెక్ట్‌కు చేరాయి. ఇక నుండి హంసలదీవి సముద్రం వద్ద కలవనున్నాయి. కాగా గత ఏడాదిన్నర కాలంగా కృష్ణానదిలో తగినస్థాయిలో నీరు లేకపోవటంతో ఈ సంవత్సరం కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా అక్విడెక్ట్ వద్ద పరవళ్లు తొక్కుతుండటంతో పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చి చూస్తున్నారు. అలాగే పంట కాల్వలకు కూడా నీరు తగిన స్థాయిలో అందుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరద నీటిని క్రమబద్ధీకరిస్తున్నారని, అయినప్పటికీ పల లపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
అవనిగడ్డలో కుంభవృష్టి
అవనిగడ్డ, పరిసర ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం కుంభవృష్టితో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారిపై వర్షం నీరు ప్రవహించటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.
పల్లపు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. అంతర్గత రహదారులు చిత్తడిగా దర్శనమిస్తున్నాయి. దీంతో పాదచారులు, వాహన చోదకులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. దాదా పు 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.