కృష్ణ

యుద్ధప్రాతిపదికన వర్షం నీరు తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), సెప్టెంబర్ 1: బందరు పట్టణంలో గురువారం గంట పాటు కురిసిన భారీ వర్షానికి రహదారులు, పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి. అనంతరం ఒక్కసారిగా వర్షం ఆగిపోయి ఎండ కాయటంతో నీటి ప్రవాహం తగ్గింది. మున్సిపల్ ఛైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ వర్షం నీటితో చెరువులను తలపిస్తున్న పల్లపు ప్రాంతాలను పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ వర్షాల దృష్ట్యా పట్టణంలో నీ రు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పల్లపు ప్రాం తాల్లోని నీటిని ఇంజన్లతో తొలగిస్తున్నట్లు తెలిపారు. హైనీ హైస్కూల్ పక్కన భారీగా నీరు నిలిచి ఉండటాన్ని గమనించి వెంటనే పొక్లెయిన్‌తో కచ్చా డ్రైన్ నిర్మించామన్నారు. పట్టణంలో దోమల నివారణకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వర్షం నీరు నిల్వ ఉన్నచోట కొద్దిపాటి కిరోసిన్ వేసి దోమలను నిర్మూలించాలన్నారు. ఆయన వెంట కౌన్సిలర్ శీలం జయ వెంకట చంద్రమారుతి, పద్మనాభుని శేఖర్, బత్తుల రమేష్, తదితరులు ఉన్నారు.