కృష్ణ

బందరు ఓడరేవు భూసమీకరణకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, సెప్టెంబర్ 19: బందరు ఓడరేవు, పారిశ్రామిక వాడ ఏర్పాటుకు అవసరమైన భూములను సమీకరించేందుకు ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేశారు. మొత్తం 33వేల 337.67 ఎకరాలకు గాను ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్‌ను మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అధారిటీ (మడ) వైస్ చైర్మన్ గంధం చంద్రుడు విడుదల చేశారు. ఇందులో 14వేల 620 ఎకరాలు పట్టా భూములు ఉండగా 9వేల 203 ఎకరాలు అసైన్డ్ భూమి, 9వేల 778 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. మడ పరిధిలోని 28 గ్రామాల్లో గ్రామ కంఠాలు, నివాస ప్రాంతాలను మినహాయించి నోటిఫికేషన్ జారీ చేశారు. గ్రామాల వారీగా సర్వే నెంబరు, విస్తీర్ణం, అనుభవదారు, పట్టా, అసైన్డ్, ప్రభుత్వ భూముల వివరాలను నోటిఫికేషన్‌లో పొందుపర్చారు. ఓడరేవు, కోస్టల్ కారిడార్ నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు సోమవారం పామర్రు మండలం నెమ్మలూరులో జరిగిన బెల్ కంపెనీ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గత రెండు మూడు నెలల నుండి ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ జారీకి అధికారులు తీవ్రమైన కసరత్తు చేశారు. భూములను సమీకరించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అధారిటీ (మడ)కు అధికారుల కొరత ఉండటంతో కొంత జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో గత నెల రోజులుగా స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొల్లు రవీంద్ర నోటిఫికేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా కలెక్టర్ బాబు.ఎ సైతం గత సోమవారం మడ అధికారులతో సమీక్షించి ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. సిబ్బంది కొరతను తీర్చేందుకు కలెక్టరేట్, గుడివాడ, బందరు డివిజన్‌ల నుండి రెవెన్యూ అధికారుల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. దీంతో గత వారం రోజులుగా బందరు ఆర్డీవో పి సాయిబాబు నేతృత్వంలో మడ అధికారులు నిద్రాహారాలు మాని ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను వేగవంతం చేసి నోటిఫికేషన్ జారీకి మార్గం సుగమం చేశారు. నేటి నుండి మడ అధికారులు నోటిఫికేషన్‌లో పొందుపర్చిన సర్వే నెంబర్ల భూములను పరిశీలించి పొజిషన్‌లో ఉన్న రైతులను గుర్తిస్తారు. ఈ నెల 27వతేదీ నుండి అక్టోబర్ 4వతేదీ వరకు గ్రామసభలు నిర్వహించనున్నారు. గ్రామసభల ద్వారా ఫామ్-1, 2, 3 పత్రాలను రైతుల నుండి స్వీకరిస్తారు. అలాగే అభ్యంతరాలు కూడా స్వీకరించనున్నారు. గ్రామం యూనిట్‌గా భూముల పరిశీలన జరగనుంది. ఇందు కోసం మడకు చెందిన ఏడుగురు డెప్యూటీ కలెక్టర్లు, 10 మంది డెప్యూటీ తహశీల్దార్లు, 10 మంది సీనియర్ అసిస్టెంట్‌లు, 17 మంది సర్వేయర్లు పని చేయనున్నారు. అయితే ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్‌పై పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. నోటిఫికేషన్‌లో పొందుపర్చిన అంశాలపై మంగళవారం ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా బందరు పోర్డు, పారిశ్రామిక వాడ ఏర్పాటు విషయంలో ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుండగా దీన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.