కృష్ణ

వాడివేడిగా నందిగామ నగర పంచాయతీ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిగామ, సెప్టెంబర్ 30: పలు ప్రధాన సమస్యలపై అధికార మరియు విపక్ష సభ్యుల మూకుమ్మడిగా దాడితో శుక్రవారం జరిగిన నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా సాగింది. చైర్‌పర్సన్ యరగొర్ల పద్మావతి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఎజండాలోని అంశాలను మున్సిపల్ ఆర్‌ఐ రమణ చదవడం ప్రారంభించగా కృష్ణా పుష్కరాల సందర్భంగా నగర సుందరీకరణలో భాగంగా చేపట్టిన పనుల ఖర్చుకు అసిస్టెంట్ ఇంజనీర్ బి రామకృష్ణ అడ్వాన్స్‌గా చెల్లించిన రూ.4 లక్షల అంశంపై డిప్యూటి ప్లోర్ లీడర్ కత్రోజు శ్రీనివాసాచారి, 4వ వార్డు కౌన్సిలర్ సరికొండ రవీంద్రబాబు తదితరులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అడ్వాన్స్ చెల్లింపుల ద్వారా అత్యవసర పనులను చేయడం లేదు కానీ పాలకవర్గ ఆమోదం లేకుండానే సుందరీకరణకు అడ్వాన్స్ చెల్లించడం ఏమిటంటూ ప్రశ్నించారు. పాలకవర్గానికి, కౌన్సిల్‌లో వర్క్స్ కమిటీకి ఎటువంటి సమాచారం లేకుండా ఏకంగా రూ.4లక్షలు ఏ విధంగా ఖర్చు చేశారు అని ప్రశ్నించారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలు వెల్లడించిన తరువాతే ఆమోదిస్తామని తెలియజేశారు. దీంతో ఈ అంశాన్ని తరువాత సమావేశానికి వాయిదా వేశారు. వైస్ చైర్‌పర్సన్ వడ్డెల్లి అశోక్‌కుమారి, సభ్యులు శాఖమూరు స్వర్ణలత, మనుబోతుల శ్రీరామ, పాములపాటి రమణ, గుంటుపల్లి వెంకట్రావు, మాడుగుల నాగరత్నం, కృష్ణారావు తదితరులు పలు సమస్యలను ప్రస్థావించారు. కాంట్రాక్ట్ కార్మికుల ఏజన్సీ నిర్వహకుడు పారిశుద్ధ్య కార్మికులకు గ్లౌజ్‌లు, నూనె తదితర వస్తువులు అందజేయకపోయినా బిల్లులు ఎలా చెల్లిస్తున్నారని ప్రశ్నించారు. పారిశుద్ద్యం, తాగునీరు, వీధి దీపాలు తదితర సమస్యలను పరిష్కరించకపోవడం వల్ల ప్రజల ముందు తలెత్తుకోలేని పరిస్థితి నెలకొంటుందని పలువురు సభ్యులు పేర్కొన్నారు. ఎజండాలోని ఇతర అంశాలను ఆమోదించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చైర్‌పర్సన్ యరగొర్ల పద్మావతి, ఇన్‌చార్జి కమీషనర్ రామకృష్ణలు వెల్లడించారు. సమావేశ ప్రారంభంలో హౌసింగ్ డిఇ నూతనంగా ప్రవేశపెట్టిన గృహ నిర్మాణ పథకం గురించి సభ్యులకు వివరించారు. ఈ పథకంకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించాల్సి ఉంటుందన్నారు.