కృష్ణ

బస్టాండ్‌లో యువకుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, అక్టోబర్ 7: మోపిదేవి మండలం చిరువోలు గ్రామానికి చెందిన సజ్జా గంగరాజు(23) అనే యువకుడు అవనిగడ్డ బస్ స్టేషన్‌లో ఆత్మహత్య చేసుకుని పడి ఉండగా శుక్రవారం పోలీసులు గుర్తించారు. యానాదుల కులానికి చెందిన గంగరాజు అవనిగడ్డ శివారు కొత్తపేటకు చెందిన పోతరాజమ్మతో ఇటీవల వివాహం జరిగింది. కాగా ఇటీవల వీరి మధ్య మనస్పర్ధలు తలెత్తటంతో ఎవరికి వారు విడివిడిగా ఉంటున్నారు. కాగా గురువారం పోతరాజమ్మ చిరువోలు వెళ్ళి భర్తతో సహా ఇద్దరూ గత రాత్రి అవనిగడ్డకు చేరుకున్నారు. కాగా గంగరాజు పురుగు మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడి ఉండటంతో శుక్రవారం కనుగొన్నారు. ఈ మేరకు అవనిగడ్డ పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో రూ.2 లక్షల ఆస్తినష్టం
కూచిపూడి, అక్టోబర్ 7: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పశువుల పాక దగ్ధమై రెండు పాడి పశువులు తీవ్రంగా గాయపడిన సంఘటన మొవ్వ మండలం పద్దారాయుడుతోటలో శుక్రవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. పద్దారాయుడుతోట గ్రామానికి చెందిన మురారి మంగయ్య పశువుల పాకలో తెల్లవారు జామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించిన అగ్ని ప్రమాదంలో నాలుగు పాడి పశువులు, మూడు గేదెలు గాయాలపాలయ్యాయి. వీటిలో రెండు పాడి పశువులకు తీవ్రంగా కాలటంతో వైద్యులు చికిత్సలు నిర్వహిస్తున్నారు. రూ.లక్షా 50వేల విలువ చేసే పాడి పశువులు, పూరిపాక దగ్ధమైనట్లు బాధితుడు పేర్కొన్నాడు.