కృష్ణ

నేడు టిడిపిలోకి జ్యోతుల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 10: తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సోమవారం తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. సోమవారం సాయంత్రం స్థానిక ఎ1 కనె్వన్షన్ హాలులో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జ్యోతుల నెహ్రూ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 100 బస్సులలో జనాన్ని గోదావరి జిల్లా నుంచి తరలిస్తున్నారు. అలాగే 200 కార్లలో అభిమానులు ఇక్కడికి చేరుకుంటారని జ్యోతుల నెహ్రూ ఆదివారం ‘ఆంధ్రభూమి’కి చెప్పారు. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.
ఈ నెల 8న తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గానికి చెందిన వరుపుల సుబ్బారావు, నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే సునీల్ తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. జ్యోతుల కూడా టిడిపిలో చేరితే మొత్తం 11 మంది ఎమ్లెల్యేలు వైకాపా ఎమ్మెల్యేలు టిడిపిలోకి ఇప్పటి వరకూ వచ్చినట్టవుతుంది.
ఇదిలా ఉండగా ఈ నెలలో మరో నలుగురు, ఐదుగురు టిడిపిలో చేరుతారని ఆ పార్టీ వర్గాలు చెపుతున్నాయి. వైకాపా ఎమ్మెల్యేలను టిడిపిలోకి చేర్చుకునే బాధ్యతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని టిడిపి ఎమ్మెల్యేలకు అప్పగించారు. ఈ సందర్భంగా అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఆదివారం ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ వైకాపా ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నాం. ఈ నెలలో మరికొంతమంది వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
కొడాలి నాని చుట్టూ తిరుగుతున్న రాజకీయం
ఇదిలా ఉండగా గుడివాడ వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని చుట్టూ రాజకీయాలన్నీ తిరుగుతున్నాయి. కొద్ది రోజుల కిందట విజయవాడకు వచ్చిన నందమూరి హరికృష్ణ, నాని ఒకే కారులో ప్రయాణించడం చర్చనీయాంశమైంది. తాను వైకాపాను విడిచిపెట్టి వెళ్లేది లేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కానీ, ఆయన త్వరలోనే టిడిపిలో చేరుతారన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. నాని రాకపై టిడిపికి చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే వ్యాఖ్యానిస్తూ ఆయన ఇప్పట్లో టిడిపిలోకి రాకపోవచ్చన్నారు. ఏది ఏమైనా ఈ నెలాఖరులోగా ఉత్తర కోస్తా నుంచి కొంతమంది వైకాపా ఎమ్మెల్యేలు టిడిపిలో చేరడం ఖాయమని తెలుస్తోంది.