కృష్ణ

కాపుగర్జన ఘటనతో కమిషనరేట్ అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 31: కాపులను బిసిల్లో చేర్చాలంటూ ఇతరత్రా డిమాండ్లతో తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగిన కాపుగర్జనలో చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో నగర పోలీసు కమిషనరేట్ అప్రమత్తమైంది. సభలో జరిగిన విధ్వంసకాండ రాష్టవ్య్రాప్తంగా వ్యాపించకుండా ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని వెంటనే అప్రమత్తం చేసింది. దీనికి తోడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన నివాసంలో అందుబాటులో ఉన్న మంత్రులు, డిజిపి, అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం నేరుగా నగరంలోని క్యాంపు కార్యాలయానికి చేరుకుని మరలా మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్ర, అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ విధ్వంసకాండకు కారణమైన వారిని పోలీసులే చూసుకుంటారని, అయితే రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నట్లు సీఎం చెప్పారు. ఈక్రమంలో నగర పోలీసు కమిషనరేట్‌తోపాటు, జిల్లాలో సైతం భద్రత కట్టుదిట్టం చేశారు. తుని ఘటన ప్రభావం జిల్లా, నగరం మీద పడకుండా ముందుగానే కాపు నాయకుల ఇళ్లు, కార్యాలయాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇంటిలిజెన్స్, స్పెషల్ బ్రాంచి విభాగాలు రంగంలోకి దిగి సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నాయి. ఇక నగరంలోని ప్రధాన కూడళల్లో పోలీసు అధికారులు, సిబ్బంది ప్రత్యేక పికెట్లు నిర్వహించారు. ఇదిలా ఉండగా రామలింగేశ్వరనగర్ వద్ద సుమారు 30మంది యువకులు ధర్నాకు దిగారు. వెంటనే పోలీసు బలగాలు ఇక్కడ మోహరించాయి. ఏవిధమైన అవాంఛనీయ సంఘటనలకు, విధ్వంసాలకు, హింసకు తావు లేకుండా కట్టుదిట్టం చేశారు. ఇదే సమయంలో పోలీసు అధికారులు రంగంలోకి ఆందోళనకారులతో చర్చలు జరిపి నచ్చచెప్పి శాంతియుతంగా పంపేశారు. మూడువేల మంది భద్రతా సిబ్బంది రంగంలోకి దిగాయి. ప్రత్యేక బలగాలు సున్నితమైన ప్రాంతాల్లో మోహరించాయి. సింగ్‌నగర్, పాయకాపురం, కృష్ణలంక తదితర ప్రాంతాల్లో ప్రధానంగా పోలీసు భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సీఎం క్యాంపు కార్యాలయ ప్రాంతాన్ని సైతం భద్రతా బలగాలు తమ అదుపులోకి తీసుకున్నాయి.