కృష్ణ

మూడో దశ స్వచ్ఛ సర్వేక్షన్ సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 19: స్వచ్ఛ సర్వేక్షన్ -2017 సిటీ ర్యాంకింగ్ సర్వే రెండు దశల్లో విజయవాడ నగరం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవగా దేశ వ్యాప్తంగా 15వ ర్యాంకుకు చేరిందని విఎంసి కమిషనర్ వీరపాండియన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రారంభమైన మూడవ దశ సర్వేలో కూడా నగర ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటే విజయవాడ నగరానికి దేశ వ్యాప్తంగా మొదటి ర్యాంకు వచ్చే అవకాశం ఉన్నందున నగర ప్రజలందరూ ఈ సర్వే ప్రక్రియలో పాల్గొనాలని ఆయన కోరారు. దేశ వ్యాప్తంగా 500 నగరాలు పాల్గొంటున్న సర్వేక్షన్ సర్వే మూడు పార్టులుగా జరుగుతుందని, మొత్తం 2000 మార్కులకు గాను 1400 మార్కులకు నగరంలో సర్వే పూర్తయిందని, ప్రస్తుతం మిగిలిన 600 మార్కులకు సర్వే జరగబోతోందన్నారు. పోన్‌కాల్, సోషల్ మీడియా ద్వారా సిటిజన్ ఫీడ్ బ్యాక్‌కు 450 మార్కులు, స్వచ్ఛత యాప్ నుంచి వచ్చిన సిటిజన్ ఫీడ్ బ్యాక్‌కు 150 మార్కులు సాధించినట్టు తెలిపారు. ఈనెల 14వ తేదీ వరకూ వచ్చిన ఫోన్ కాల్, సోషల్ మీడియా ద్వారా వచ్చిన సిటిజన్ ఫీడ్ బ్యాక్ రిపోర్టులో 59వేల 420 మంది నగర ప్రజల అభిప్రాయాలను సేకరించి రికార్డు చేయడం జరిగిందన్నారు. స్వచ్ఛత యాప్ నుంచి వచ్చిన సిటిజన్ ఫీడ్‌బ్యాక్‌లో ఈనెల 17వ తేదీ నాటికి 26వేల 40 మంది ప్రజలు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొన్నారని తెలిపారు. యాప్ ద్వారా వచ్చిన 12వేల 196 ఫిర్యాదులకు గాను 11వేల 466 ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించిన నేపథ్యంలో 3వేల 997 మంది సంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో మొత్తం 19వేల 982 మార్కులు వచ్చి దేశంలో 15వ స్థానం, రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందన్నారు. అయితే ప్రస్తుతం మూడవ ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో నగర ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొనాలని ఆయన కోరారు. కేవలం రెండు నిమిషాలను కేటాయించడం ద్వారా నగరాన్ని ప్రధమ స్థానంలో నిలపవచ్చని తెలుపుతూ స్వచ్ఛ సర్వేక్షన్ వెబ్‌సైట్‌లోకి ప్రవేశించి తమ వివరాలను నమోదు చేయాలని సూచించారు. నగర పరిసరాల పరిశుబ్రత, మార్కెట్ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన డస్ట్‌బిన్, చెత్తకుండీలు, గృహాల నుంచి సేకరణ, మరుగుదొడ్ల ఏర్పాటు, నిర్వహణ లపై గత సంవత్సర కాలంగా చేసిన కృషిపై ప్రజలు అభిప్రాయాలను చెప్పాలని కమిషనర్ వీరపాండియన్ కోరారు.

ఆపండీ...!
* చివరి నిముషంలో ఆగిన బాల్య వివాహం
* నిలిపివేసిన చైల్డ్‌లైన్... పోలీసులు
పాయకాపురం, ఫిబ్రవరి 19: అ దొక మైనార్టీలకు సంబంధించిన వివాహ వేదిక. కొద్ది క్షణాల్లో వివాహతంతు ముగుస్తుంది. ఆ హ్వానితులంతా కమ్మని బిర్యాని భుజించేందుకు సన్నద్ధమవుతున్న సమయం... అంతా... శుభం.. అవుతుందనుకున్న సమయంలో పోలీసులు రంగప్రవేశం చేశారు. పెళ్లి ఆపండంటూ ‘హు కుం’ జారీ చేశారు. దీంతో ఖంగుతిన్న ఇరుపక్షాలు ఏందుకంటూ పోలీసుల్ని నిలదీశారు. తమ న్యాయ నియమావళి ప్రకారమే వివాహం చేస్తున్నట్లు తెలిపారు. ఈ తతంగమంతా నున్న రూర ల్ పోలీసు స్టేషన్ పరిధిలోని నున్న గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. సేకరించిన వివరాల ప్రకారం నున్న గ్రామానికి చెందిన ఒక సామాజిక వర్గానికి చెందిన ఇరుపక్షాల అంగీకారంతో వివాహ ఏర్పాట్లు తుది దశ కు చేరుకున్నాయి. ఇదే సమయంలో అబ్బాయి మేజర్, అమ్మాయి మైనర్ (16) అనే విషయం అటు చైల్డ్‌లైన్ అధికారులకు ఇటు స్థానిక పోలీసులతో పాటు ఇంటిగ్రేషన్ డెవలప్‌మెంట్ (ఐసిడిఎస్) అధికారిణి నాగమణికి సమాచారం అందింది. వెంటనే పోలీసులతో పాటు చైల్డ్‌లైన్, ఐసిడిఎస్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వివాహ తంతుని నిలిపేశారు. బాలిక మైనర్ కావడంతో ఏ విధంగా వివాహం చేస్తారని అధికారులు ప్రశ్నించారు. దీంతో సామాజిక వర్గం పెద్దలు ఇది తమ మత చట్ట ప్రకారం సబబేనని వాదించడంతో చైల్డ్‌లైన్ సెంట్రల్ కోఆర్డినేటర్ పాల్, బృంద సభ్యులు అబ్రహం, ఐసిడిఎస్ అధికారిణి నాగమణి పెళ్లి బృందానికి చట్టానికి సంబంధించి వివరాల్ని విశధీకరించడంతో ఇరుపక్షాలు వివాహాన్ని నిలిపేసేందుకు అంగీకరించారు. దీంతో వివాహం మధ్యలోనే నిలిచిపోయింది. బాలిక తండ్రి సైతం వివాహాన్ని నిలిపేస్తున్నామని, బాలిక మైనార్టీ తారేంత వరకు వివాహం చేయమని రాతపూర్వకంగా తెలియజేసినట్లు చైల్డ్‌లైన్ అధికారులు తెలిపారు. రానున్న మంగళవారం నాడు సదరు బాలిక కుటుంబాన్ని చైల్డ్‌లైన్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. నున్న ఎస్‌ఐ శ్రీనివాసరావు ఇతర సిబ్బంది వివాహాన్ని నిలుపుదల చేసేందుకు సహకరించారు. చట్ట ప్రకారం బాల్య వివాహం జరిగినప్పుడు అటుఇటు తల్లిదండ్రులు, పెళ్లి పెద్దలు, ఫంక్షన్ హాలు యజమాని, భాజాభజంత్రీల వారు చివరకు పెళ్లి భోజనాలు తయారు చేసినివారు కూడా శిక్షార్హులవుతారు.

ముగిసిన ఆలిండియా వర్సిటీ ఆర్చరీ పోటీలు
విజయవాడ (స్పోర్ట్స్), ఫిబ్రవరి 19: అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయాల అర్చరీ ఓవరాల్ చాంపియన్‌గా పంజాబీ యూనివర్శిటీ క్రీడాకారులు నిలిచారు. కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో హిందూ కళాశాల క్రీడా మైదానంలో గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయాల ఆర్చరీ చాంపియన్‌షిప్ పోటీల్లో ఇండియన్, రికర్వ్, కాంపౌండ్ రౌండ్‌లలో పోటీలు జరుగగా ఆదివారంతో ముగిశాయి. ఇండియన్‌రౌండ్ ఓవరాల్‌లో మీరట్‌కు చెందిన చౌదరి చరణ్ సింగ్ యూనివర్శిటీ విన్నర్‌గా, యూనివర్శిటీ ఆఫ్ కాలికట్ రన్నర్స్‌గా, రికర్వ్ విభాగంలో అమృతసర్‌కు చెందిన గురునానక్ దేవ్ యూనివర్శిటీ విన్నర్స్‌గా, పంజాబ్ యూనివర్శిటీ రన్నర్స్‌గా, కాంపౌండ్ విభాగంలో పంజాబ్ యూనివర్శిటీ విన్నర్స్‌గా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కెఎల్ యూనివర్శిటీ క్రీడాకారులు రన్నర్‌గా నిలిచారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యదర్శి వరదరాజన్, దామోదర సంజీవయ్య, జాతీయ న్యాయ విశ్వ విద్యాలయం ఉపకులపతి కేశవరావు, దక్షిణ మధ్య రైల్వే మండలి విజయవాడ రీజనల్ మేనేజర్ అశోక్ కుమార్, శాప్ ఓఎస్‌డి రామకృష్ణ, రూసా డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, ఎపి అర్చరి అసోసియేషన్ కార్యదర్శి చెరుకూరి సత్యనారాయణ, కృష్ణా విశ్వ విద్యాలయం ఉపకులపతి ఆచార్య సుంకరి రామకృష్ణారావు, పూర్వపు ఉపకులపతి ఆచార్య వి వెంకయ్య చేతుల మీదుగా విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ట్రోఫీలు అందుకున్న విజేతలు సంబరాల్లో మునిగి తేలారు. ఎవరికి వారు ట్రోఫీలతో ఫోటోలు దిగి సందడి చేశారు. ఐదు రోజుల పాటు జరిగిన పోటీల్లో ఏ మాత్రం క్రమశిక్షణ తప్పకుండా అత్యద్భుతమైన ప్రతిభ కనబర్చి లక్ష్యం వైపు విల్లంబులను సంధించారు. ఈ నెల 15వతేదీన ప్రారంభమైన ఈ పోటీల్లో దేశ వ్యాప్తంగా 19 రాష్ట్రాల నుండి 98 విశ్వ విద్యాలయాలకు చెందిన 1020 మంది విలువిద్య క్రీడాకారులు పాల్గొన్నారు. మచిలీపట్నం కోస్తా తీరమైనప్పటికీ పోటీల నిర్వహణలో కృష్ణా విశ్వవిద్యాలయం అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ఎక్కడా రాజీ పడకుండా విస్తృత ఏర్పాట్లు చేసి క్రీడాకారుల అభిమానాన్ని చూరగొన్నారు.