కృష్ణ

రాజధాని రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 22: అమరావతి పరిసర ప్రాంతంలో రాజధాని నిర్మాణం చేపట్టడం హర్షించదగిన విషయం అయినప్పటికీ రాష్ట్ర ప్రభు త్వం రాజధాని నిర్మాణంపై శివరామకృష్ణ కమిటీ సిఫార్సులను ఏ మాత్రం పట్టించుకోలేదని పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి బుధవారం సిఎం చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. శివరామకృష్ణ కమిటీ సుమారు 927 ఎకరాల్లో రాజధాని నిర్మించవ్చని తెలిపినప్పటికీ అవసరాలకు మించి వేలాది ఎకరాల భూమి సేకరించడం సరికాదన్నారు. అది కూడా బంజరు భూములు, పోడు భూములు, అటవీ భూములను వదిలేసి పంట భూములను ప్రభుత్వ అవసరాలకు వినియోగించరాదంటూ చట్టాలు ఘోషిస్తున్నా లెక్కచేయక మూడు పంటలు పండే జరీబు భూములను రైతుల నుంచి భూసేకరణ పేరుతో లాక్కోవడం అన్యాయమన్నారు. అంతేగాక రాజధాని ప్రాంతంలోని రైతులు, రైతు కూ లీలు మరియు సామాన్య ప్రజానీకానికి ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఇప్పటికీ అమలుపర్చకపోవటం శోచనీయమన్నారు. రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం నాయకులు, ప్రభుత్వ అధికారులు భారీ అవనీతికి పాల్పడుతున్నారన్నారు. ప్రశ్నించిన వారిపై గూండాలను, పోలీసులను ఉసిగొల్పడం అ మానుషమన్నారు. భూములిచ్చిన రైతులకు 270 రోజుల్లో ప్లాట్ల కేటాయింపు చేస్తామన్న హామీ ఇప్పటికీ అమలు కాలేదన్నారు. గ్రామస్థుల ఉమ్మడి అవసరాల నిమిత్తం భూకేటాయింపులు ఇంతవరకు జరగలేదని, రాజధాని ప్రాంత విద్యార్థులందరికీ ఉచిత విద్య కల్పిస్తామని ఇచ్చిన హామీ అమలు చేయలేదన్నారు. పెనుమాక, ఉండవల్లి, బేతపూడి, నిడమర్రు, రాయపూడి తదితర గ్రామాలలో అవసరం లేకున్నా ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో బలవంతపు భూసేకరణకు శ్రీకారం చుట్టిందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్ర భుత్వం ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అవనీతి, దోపిడీలకు ముగింపు పలకాలని రాజధాని ప్రాంత ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని, లేని పక్షంలో రాజధాని ప్రాంత ప్రజల హక్కుల రక్షణకై కాంగ్రెస్ పార్టీ ప్రజా పోరాటం చేస్తుందని ఆ లేఖలో హెచ్చరించారు.

బ్యాంకులో ఖాతాదారుని
బంగారం మాయం
విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 22: లాకర్‌లో పెట్టుకునేందుకు వచ్చిన ఓ ఖాతాదారుని బంగారం బ్యాంకులోనే మాయమైంది. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయతే అసలు బంగారం మాయం కావడంపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణలంక కల్పన ప్రింటర్స్ రోడ్డులో నివాసముంటున్న జమ్మల చిన పూర్ణచంద్రరావుకు సూర్యారావుపేట పోలీస్టేషన్ పరిధిలోని నక్కలరోడ్డులో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఖాతా ఉంది. ఈయన బుధవారం బ్యాంకుకు వచ్చాడు. తనతోపాటు తీసుకొచ్చిన 152గ్రాముల బంగారం లాకర్‌లో పెట్టేందుకు కౌంటర్‌లో సంప్రదించాడు. అయితే కొంత సమయం పట్టనున్నందున ఆయన అక్కడే కూర్చొని బంగారం ఉన్న బాక్సు పక్కన పెట్టాడు. ఆదమరిచి పక్కకు వెళ్లివచ్చి చూసేసరికి బాక్సు ఉంది గాని అందులో బంగారం మాత్రం మాయమైంది. వెంటనే బ్యాంకు అధికారులకు విషయం చెప్పగా చుట్టుపక్కల గాలించారు. ఫలితం లేక బ్యాంకు సిబ్బందితో కలిసి చిన పూర్ణచంద్రరావు సూర్యారావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిలో భాగంగా బ్యాంకులోని సిసి కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.