కృష్ణ

పేదల ఇళ్లు తొలగిస్తే ఊరుకోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ, ఫిబ్రవరి 22: సర్వేల పేరుతో పేదల ఇళ్లు కూల్చుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి కాలం చెల్లిందని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సిహెచ్ బాబూరావు హెచ్చరించారు. డివిజన్‌లోని భవానీపురం కరకట్ట ప్రాంతంలో అధికారులు రెండు రోజులుగా సర్వేలు నిర్వహిస్తున్నారని తెలిపారు. సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం కల్చరల్ సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా బాబూరావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు పాలక పార్టీలు పేదలకు ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చాయని గుర్తుచేశారు. అయితే ఇప్పటివరకు కరకట్ట ప్రాంతంలో రెండు వేల ఇళ్లు తొలగించారని విమర్శించారు.

హెచ్‌సిఎల్ కంపెనీకి కేసరపల్లిలో స్థలం!
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 22: గన్నవరం మండలం కేసరపల్లి వద్ద హెచ్‌సిఎల్ కంపెనీ ఏర్పాటుకు అవసరమైన భూమి లభ్యతపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ బాబు.ఎ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కేసరపల్లిలో హెచ్‌సిఎల్ కంపెనీ ఏర్పాటుపై కంపెనీ ప్రతినిధులు, ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా, రెవెన్యూ అధికారులతో బుధవారం ఎయిర్‌పోర్టు లాంజ్‌లో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఐటి హబ్‌గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారని, దీనిలో భాగంగా ఇప్పటికే అనేక కంపెనీలు రాష్ట్రంలో ఏర్పాటుకు ముందుకొస్తున్నాయన్నారు. ఇందులో ఎపిఐఐసికి చెందిన కేసరపల్లిలోని భూములను హెచ్‌సిఎల్ కంపెనీ ప్రతినిధులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో నిర్మించే భవనాలను ఎయిర్‌పోర్టు ఆథారిటీ ఆఫ్ ఇండియా వారి అనుమతి తప్పనిసరి కావడంతో దీనిపై అధికారులతో కలెక్టర్ చర్చించారు. జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ రంగయ్య, గన్నవరం తహశీల్దార్ మాధురి, ఎపిఐఐసి అధికారులు పాల్గొన్నారు.