కృష్ణ

అగ్నిమాపక శాఖకు అత్యాధునిక వాహనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: విపత్తుల నివారణకు అగ్నిమాపక శాఖకు అత్యాధునిక వాహనాలను సమకూర్చడం జరుగుతుందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం అగ్నిమాపక శాఖ రూ.40 లక్షలతో కొన్న నూతన అగ్నిమాపక వాహనాన్ని శనివారం ఆయన ప్రారంభించి మంత్రి రవీంద్ర మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అగ్నిమాపక శాఖ నిరంతరం కృషి చేస్తుందన్నారు. పాత వాహనాల స్థానంలో అత్యాధునిక వాహనాలను ప్రభుత్వం సమకూరుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, వైస్ చైర్మన్ కాశీ విశ్వనాథం, అగ్నిమాపక శాఖాధికారి సూర్యప్రకాశరావు, టిడిపి సీనియర్ నాయకులు కొనకళ్ల బుల్లయ్య, బూరగడ్డ రమేష్ నాయుడు, ఎఎంసి చైర్మన్ గోపు సత్యనారాయణ, టిడిపి పట్టణ అధ్యక్షుడు ఇలియాస్ పాషా తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో కరవు మండలాలను పెంచాలి
మచిలీపట్నం (కోనేరుసెంటర్): జిల్లాలో కరవు మండలాలను పెంచాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ మతీన్ డిమాండ్ చేశారు. పిసిసి పిలుపు మేరకు పలు సమస్యలపై శనివారం కలెక్టరేట్ సూపరింటెండెంట్ శర్మకు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా మతీన్ మాట్లాడుతూ కరువు పీడిత ప్రాంతాలలో వలసలను నివారించి ప్రజలను ఆదుకోవాలన్నారు. మంచినీటి అక్రమ వ్యాపారాన్ని అరికట్టాలన్నారు. పశుగ్రాసం, ఉచిత దాణా కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ, బీమా నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగానికి విరుద్దంగా పని చేస్తున్న జన్మభూమి గ్రామ కమిటీలను తక్షణమే రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కె చంద్రశేఖర్, యండి దాదా సాహెబ్, యండి ఇషాక్, పట్టణ మహిళా అధ్యక్షురాలు నల్లబోలు కుమారి, పేరిశెట్టి నాగరాజు, కల్లు వెంకటేశ్వరరావు, అబ్దుల్ ఖదీర్, శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.