కృష్ణ

క్రీడాస్ఫూర్తిని పెంపొందించటమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), ఏప్రిల్ 25: నగరపాలక సంస్థ పాఠశాలలో చదువుకొనే విద్యార్దులలో క్రీడా స్పూర్తిని నెలకొల్పలనే లక్ష్యంగా ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో నెలరోజుల పాటు వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు మేయర్ కోనేరు శ్రీధర్ అన్నారు. మంగళవారం స్టేడియంలో శిక్షణా శిబిరాలను మేయర్ ప్రారంభించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి విద్యతో పాటు క్రీడల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తునందున విఎంసి పాఠశాలలో చదువుకునే విద్యార్ధులందరికీ ఉచితంగా క్రీడలలో శిక్షణా కల్పించాలనే ఉద్దేశ్యంతో వేసవి శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. క్రీడల్లో ఆసక్తి ఉన్న విద్యార్దులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. మంచి క్రీడాకారునిగా గుర్తింపు పొంది పాఠశాలలకు, విఎంసికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని సూచించారు. శిక్షణా శిబిరంలో అన్ని ఏర్పాట్లు కల్పిస్తామన్నారు. విద్యార్ధులందరికీ అల్పహరం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని విఎంసి స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ జాస్తి సాంబశివరావు అన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎండి సిరాజుద్ధీన్, యోగా సంఘ రాష్ట్ర కార్యదర్శి రామారావు, డివైఈవో దుర్గాప్రసాద్, స్పోర్ట్స్ ఆఫీసర్ డా ఎస్ శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

భాషా సాహిత్యాభివృద్ధే ధ్యేయం

విజయవాడ (ఎడ్యుకేషన్), ఏప్రిల్ 25: భాషా సాహిత్య అభివృద్ధికి కేంద్ర సాహిత్య అకాడమీ కట్టుబడి ఉందని సాహిత్య అకాడమీ అధ్యక్షుడు విశ్వనాథ్ ప్రసాద్ తివారి అన్నారు. స్థానిక సిద్ధార్థ అకాడమీ ఆడిటోరియంలో మంగళవారం సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్ సమర్పణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విశ్వనాథ్ మాట్లాడుతూ భాషా, సాహిత్యాలు విశ్వనాథ్ మాట్లాడుతూ భాషా, సాహిత్యాలు విశ్వవ్యాప్తం కావాలని అన్నారు. అనువాద సాహిత్యం పెరగాలని, అనువాద సాహిత్యం వలన ఇతర భాషల్లో ఉండే సాహిత్యం చదివే అవకాశం కలుగుతుందన్నారు. ఈ క్రమంలోనే వారి ఆచారాలు, భాషా సంస్కృతులు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి ఏటా దేశంలోని వివిధ భాషల్లో సేవచేసిన వారికి పురస్కారాలు ఆనవాయితీగా వస్తుందన్నారు. కార్యదర్శి కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ వివిధ భాషల్లో సాహిత్యాన్ని అనువాదాల ద్వారా వెలికితీస్తున్నట్లు పేర్కొన్నారు. గత ఏడాది 23 భాషల్లో కేంద్ర సాహిత్య అకాడమీ ద్వారా 480 పుస్తకాలు ప్రచురించామన్నారు. విదేశాల్లో జరిగిన భాషా సాహిత్యాల్లో కేంద్ర సాహిత్య అకాడమీ పాల్గొంటుందన్నారు. అనంతరం ప్రాచీన, మధ్యయుగ సాహిత్యంలో నాగళ్ల గురుప్రసాదరావు, సౌరాష్టల్రో టిఆర్ దామోదరన్, టిఎస్ సరోజ సుందరరాజన్‌కు ఆయా భాషల్లో విశిష్ట సేవలను అందించినందుకు గాను భాషా సమ్మాన్ పురస్కార గ్రహీతల అనులేఖన పత్రం, భాషా సమ్మాన్ సమర్పణతో పాటు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చెక్‌ను అందజేశారు. అనంతరం నాగళ్ల గురుప్రసాద్ మాట్లాడుతూ స్నేహితుల వలనే భాషా సమ్మాన్ పురస్కారం అర్హత పొందానని ఆనందం వ్యక్తం చేశారు. లయోలా కళాశాల ఫాదర్ గోవర్థన్‌ను స్మరించుకుంటున్నానని, తాను అంటే ఆయనకు అపారమైన ప్రేమ, వాత్సల్యం అని అన్నారు. ఈ క్రమంలోనే సౌరాష్ట్ర గ్రహీతలు కూడా వారి మాటలను ఆహూతులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి సమాన వాక్యంగా సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర కంబార్ వ్యవహరించారు.