క్రైమ్/లీగల్

టిప్పర్ ఢీకొని యువకుని మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు, ఏప్రిల్ 21: టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇబ్రహీంపట్నం - చత్తీస్‌ఘడ్ 30వ నెంబరు జాతీయ రహదారిపై కుంటముక్కల క్రాస్ రోడ్ వద్ద శుక్రవారం రాత్రి టిప్పర్, బైక్‌ను ఢీకొట్టింది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈప్రమాదంలో బైక్‌పై వస్తున్న వెంకటాపురం గ్రామానికి చెందిన యరమల కృష్ణారెడ్డి (28) తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మైలవరం నుంచి తన స్వగ్రామమైన వెంకటాపురం తిరిగి వస్తుండగా ఈప్రమాదం చోటు చేసుకుంది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కృష్ణారెడ్డి మృతితో వెంకటాపురంలో విషాధ ఛాయలు అలుముకున్నాయ. ఎస్‌ఐ రాజేష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం మైలవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.